Begin typing your search above and press return to search.

చంద్రముఖి మోసం.. 'కాంచన' తో న్యాయం!

ఇటీవల లారెన్స్‌ హీరోగా నటించిన చంద్రముఖి 2 సినిమా అట్టర్ ఫ్లాప్‌ అయ్యింది. అయినా కూడా అదే జోనర్ లో కాంచన 4 సినిమాను తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

By:  Tupaki Desk   |   7 Jun 2024 5:23 AM GMT
చంద్రముఖి మోసం.. కాంచన తో న్యాయం!
X

కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్‌ ముని, కాంచన సినిమాలతో దర్శకుడిగా మచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు ఆ ఫ్రాంచైజీ లో మూడు సినిమాలు వచ్చాయి. కాంచన 2 మరియు కాంచన 3 కి మంచి విజయం దక్కడంతో మరిన్ని సినిమాలను ఆ ఫ్రాంచైజీలో తీసుకు రావాలని లారెన్స్ ఆశ పడుతున్నాడు.

తాజాగా కాంచన 4 సినిమాను అధికారికంగా ప్రకటించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న కాంచన 4 సినిమాను సెప్టెంబర్ నుంచి షూటింగ్‌ కు తీసుకు వెళ్లబోతున్నట్లు పోస్టర్ ను విడుదల చేసి అఫిషియల్ అనౌన్స్మెంట్‌ చేశాడు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రూపొందించబోతున్నాడు.

ఇటీవల లారెన్స్‌ హీరోగా నటించిన చంద్రముఖి 2 సినిమా అట్టర్ ఫ్లాప్‌ అయ్యింది. అయినా కూడా అదే జోనర్ లో కాంచన 4 సినిమాను తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. చంద్రముఖి మోసం చేసినా కూడా తనను కాంచన మోసం చేయదు అనే నమ్మకంతో లారెన్స్ తాజా సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.

ఈ మధ్య కాలంలో హర్రర్‌ కామెడీ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంది. అందుకే లారెన్స్‌ కాంచన 4 ని ప్రకటించినట్లుగా తెలుస్తుంది. చంద్రముఖి సినిమా తో నిరాశ పరిచిన లారెన్స్‌ ఖచ్చితంగా కాంచన 4 తో న్యాయం చేస్తాడని, భయపెట్టడం తో పాటు నవ్విస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు.

ఇప్పటికే వచ్చిన ముని, కాంచన, కాంచన 3 లు మంచి విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో కాంచన 4 కి పాన్‌ ఇండియా స్థాయిలో మంచి బజ్ క్రియేట్‌ అవుతుంది. తప్పకుండా అన్ని వర్గాల వారిని ఈ సినిమా మెప్పిస్తుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బాలీవుడ్‌ లో కాంచన రీమేక్ లక్ష్మి నిరాశ పరిచిన నేపథ్యంలో కాంచన 4 ను హిందీలో రీమేక్ చేయడం కాకుండా డబ్‌ చేయాలని భావిస్తున్నారట.