Begin typing your search above and press return to search.

లారెన్స్ మూవీలో ఆ బడా హీరో గెస్ట్ రోల్

కొరియోగ్రాఫర్ గా స్టార్ ఇమేజ్ అందుకున్న రాఘవ లారెన్స్ తరువాత దర్శకుడిగా మారి వరుస విజయాలు అందుకున్నాడు

By:  Tupaki Desk   |   27 May 2024 12:30 PM GMT
లారెన్స్ మూవీలో ఆ బడా హీరో గెస్ట్ రోల్
X

కొరియోగ్రాఫర్ గా స్టార్ ఇమేజ్ అందుకున్న రాఘవ లారెన్స్ తరువాత దర్శకుడిగా మారి వరుస విజయాలు అందుకున్నాడు. హర్రర్ జోనర్ చిత్రాలతో తన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం హీరోగా లారెన్స్ ఫుల్ బిజీ అయ్యారు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. లారెన్స్ నుంచి గత ఏడాది చంద్రముఖి 2, జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాలు వచ్చాయి. వీటిలో జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీ తమిళంలో హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఇప్పుడు లారెన్స్ ఓ వైపు తన కాంచన సిరీస్ లో నాలుగో సినిమాని చేసే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే లోకేష్ కనగరాజ్ నిర్మాణంలో బెంజ్ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమాతో బి కన్నన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ త్వరలో పట్టాలు ఎక్కబోతోంది. లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు.

గత ఏడాది లియో మూవీతో హిట్ కొట్టిన లోకేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యినట్లు తెలుస్తోంది. మరో వైపు నిర్మాతగా కూడా తన టీమ్ లో ఉన్నవారిని దర్శకులుగా ప్రమోట్ చేస్తూ మూవీస్ చేస్తున్నాడు. లారెన్స్ తో బెంజ్ కూడా అదే తరహాలో స్టార్ట్ చేశారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడంట.

స్టార్ హీరో అయిన సూర్య ఇతర హీరోల సినిమాలలో గెస్ట్ అప్పీరియన్స్ గా కనిపించడానికి ఎలాంటి మొహమాట పడడు. మూవీకి తన క్యారెక్టర్ ప్లస్ అవుతుందంటే కచ్చితంగా ముందుకొచ్చి నటిస్తాడు. లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాలో సూర్య రోలెక్స్ క్యారెక్టర్ లో క్లైమాక్స్ లో నటించాడు. విక్రమ్ మూవీకి ఆ క్యారెక్టర్ చాలా ప్లస్ అయ్యింది. రోలెక్స్ పాత్ర బేస్ చేసుకొని సూర్య హీరోగా ఒక మూవీ చేస్తానని లోకేష్ కనగరాజ్ గతంలో ప్రకటించాడు.

అలాగే విక్రమ్ 2లో రోలెక్స్ మెయిన్ విలన్ గా ఉంటాడనే మాట వినిపిస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో సూర్య రెండు సినిమాలు చేయడం ఖాయం అయిపొయింది. ఈ నేపథ్యంలో లోకేష్ రిక్వెస్ట్ మేరకు లారెన్స్ బెంజ్ చిత్రంలో కూడా నటించడానికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ప్రచారం నడుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించే వరకు తెలియదు.