Begin typing your search above and press return to search.

రాఘవ లారెన్స్.. ఎన్నాళ్లయ్యిందో ఇటువైపు వచ్చి..

తరువాత తనే హీరోగా స్వీయ దర్శకత్వంలో స్టైల్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   1 Jun 2024 3:15 AM GMT
రాఘవ లారెన్స్.. ఎన్నాళ్లయ్యిందో ఇటువైపు వచ్చి..
X

సైడ్ డాన్సర్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత కొరియోగ్రాఫర్ గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రాఘవ లారెన్స్. స్టార్ కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడే లారెన్స్ దర్శకుడిగా నాగార్జునతో మాస్ మూవీ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. తరువాత తనే హీరోగా స్వీయ దర్శకత్వంలో స్టైల్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తమిళంలో ముని మూవీతో హిట్ సొంతం చేసుకున్నాడు.

నెక్స్ట్ నాగార్జునతోనే డాన్ మూవీతో హిట్ దక్కించుకున్నాడు. ఇలా వరుసగా నాలుగు హిట్స్ పడటంతో దర్శకుడిగా లారెన్స్ కి మంచి పేర్కొచ్చింది. దీంతో ప్రభాస్ ఏకంగా అవకాశం ఇచ్చాడు. అతనితో రెబల్ మూవీ చేసిన లారెన్స్ కి దర్శకుడిగా మొదటి డిజాస్టర్ తగిలింది. ఈ మూవీ తర్వాత కంప్లీట్ గా కోలీవుడ్ కి లారెన్స్ పరిమితం అయిపోయాడు. కాంచన మూవీతో మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మళ్ళీ తెలుగు సైడ్ పెద్దగా తిరిగి చూడలేదు.

ముని సిరీస్ లో ఇప్పటి వరకు లారెన్స్ నాలుగు సినిమాలు చేశాడు. ఓ వైపు స్వీయ దర్శకత్వంలో లారెన్స్ ఈ సిరీస్ ని కొనసాగిస్తూనే హీరోగా వేరే దర్శకులతో వర్క్ చేస్తున్నాడు. గత ఏడాది లారెన్స్ హీరోగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అందులో రుద్రన్, చంద్రముఖి 2 డిజాస్టర్ అయ్యాయి. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీ హిట్ అయ్యింది.

ప్రస్తుతం లారెన్స్ హీరోగా కొంతమంది తమిళ దర్శకులు సినిమాలు చేయడం కోసం లైన్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ కూడా లారెన్స్ కి కథ నేరేట్ చేశాడంట. గత ఏడాది రామబాణం మూవీతో గోపీచంద్ కి డిజాస్టర్ ఇచ్చిన శ్రీవాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లారెన్స్ తో చేయడానికి సిద్ధం అవుతున్నాడంట. స్టోరీ నేరేషన్ అయిపోయిందంట.

లారెన్స్ కి కథ నచ్చడంతో ప్రస్తుతం డిస్కషన్ దశలో ఉన్నట్లు టాక్. ఒక తెలుగు నిర్మాతే దాన్ని ప్రొడ్యూస్ చేయనున్నట్లు టాక్. ఈ సినిమా ఒకే అయితే తెలుగు, తమిళ్ భాషలలో తెరకెక్కే అవకాశాలు ఉన్నాయంట. ఒక వేళ ఈ మూవీలో లారెన్స్ నటిస్తే మాత్రం 2008లో చేసిన డాన్ తర్వాత అతను చేయబోయే స్ట్రైట్ తెలుగు మూవీ అవుతుంది. మరి ఈ కాంబినేషన్ ఎంత వరకు ఫైనల్ అవుతుందనేది వేచి చూడాలి.