Begin typing your search above and press return to search.

నాకు ఫస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చింది ఆయనే: అల్లు అర్జున్

నేను చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటే పిలిచి నిన్ను హీరోని చేస్తానని చెప్పి అడ్వాన్స్ గా 100 రూపాయిలు ఇచ్చిన ఫస్ట్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు గారు.

By:  Tupaki Desk   |   15 Nov 2024 4:52 AM GMT
నాకు ఫస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చింది ఆయనే: అల్లు అర్జున్
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి సినిమాకి సినిమాకి తనని తాను నటుడిగా మెరుగుపరుచుకుంటూ ఉన్నాడు. అలాగే కొత్త కొత్త క్యారెక్టరైజేషన్స్ తో మూవీస్ చేసి సక్సెస్ లు అందుకున్నాడు. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారడంతో పాటు, నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న ఫస్ట్ తెలుగు హీరోగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. నెక్స్ట్ అతని నుంచి రాబోయే 'పుష్ప 2' కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది.

ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా అన్ని భాషలలో కలిపి 1000 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తాజాగా బాలయ్య హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాపబుల్ సీజన్ 4లో పాల్గొన్నాడు. అతని ఎపిసోడ్ శుక్రవారం నైట్ రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ చాలా ఇంటరెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ఈ ఎపిసోడ్ లో భాగంగా అల్లు అర్జున్ కెరియర్ లో కీలక భూమిక పోషించిన దర్శక, నిర్మాతల వీడియో బైట్స్ వేశారు.

అల్లు అర్జున్ వారి గురించి ఆసక్తికర విషయాలు ఈ సందర్భంగా పంచుకున్నారు. నేను చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటే పిలిచి నిన్ను హీరోని చేస్తానని చెప్పి అడ్వాన్స్ గా 100 రూపాయిలు ఇచ్చిన ఫస్ట్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు గారు. నా ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యాక నా కాబిన్ లో ఇప్పటికే నా ఫస్ట్ డైరెక్టర్ అని రాఘవేంద్రరావు గారి ఫోటో ఉంటుందని బన్నీ తెలియజేశారు. అలాగే నటుడిగా నా ఫౌండేషన్ సెట్ చేయడంలో సుకుమార్, దిల్ రాజు నా లైఫ్ లో కీ ప్లేయర్స్ అని బన్నీ చెప్పారు.

గుణశేఖర్ గారితో నేను చేసిన ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే ఆ మూవీ ఫెయిల్ అయిన కూడా అతను పెట్టిన ఎఫర్ట్ నాకు బాగా నచ్చింది. తప్పు చేయడానికి, పొరపాటు జరగడానికి చాలా తేడా ఉంటుంది. వరుడు మూవీ విషయంలో పొరపాటు జరిగింది. అయితే లేడీ ఒరియాంటెడ్ మూవీగా 40 కోట్లు పెట్టి ఆయన 'రుద్రమ్మదేవి' చేశారు. అందులో గెస్ట్ రోల్ ఉంది. అది ఎవరు చేయడానికి ముందుకి రాలేదు. సినిమా అలా ఆగిపోయి ఉంది. అందుకే నేనే వెళ్లి ఆ రోల్ చేస్తానని చెప్పి చేసాను. అలాగే శాకుంతలంలో స్పెషల్ రోల్ కోసం మా అమ్మాయిని అడిగారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరియర్ లో హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చారు. అలాగే 'అల వైకుంఠపురం' లో సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందించారు అని బన్నీ చెప్పారు. నాకు బోయపాటి ఎలాగో నీకు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలా అని బాలయ్య మధ్యలో సరదాగా చెప్పుకొచ్చారు. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం వారందరూ అని బన్నీ ఈ సందర్భంగా తన కృతజ్ఞతని తెలియజేశారు.