Begin typing your search above and press return to search.

ప్రభాస్ ని లాంచ్ చేయాల్సింది ఆయనే కానీ..?

స్టార్ వారసులు సినిమా అంటే అది దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలోనే జరగాలనే ఒక బలమైన సెంటిమెంట్ ఉండేది.

By:  Tupaki Desk   |   21 Dec 2024 12:30 PM GMT
ప్రభాస్ ని లాంచ్ చేయాల్సింది ఆయనే కానీ..?
X

స్టార్ వారసులు హీరోగా ఎంట్రీ ఇవ్వాలంటే అప్పట్లో ఒక సెంటిమెంట్ ఉండేది. స్టార్ వారసులు సినిమా అంటే అది దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలోనే జరగాలనే ఒక బలమైన సెంటిమెంట్ ఉండేది. వెంకటేష్ నుంచి మొదలైన ఆ సెంటిమెంట్ అలా మహేష్, అల్లు అర్జున్ దాకా వస్తూ వచ్చింది. చరణ్ హీరో అయ్యే టైం కు రాఘవేంద్ర రావు ఫాం కోల్పోయారు అందుకే ఆ బాధ్యత పూరీకి ఇచ్చారు చిరంజీవి. ఐతే ప్రభాస్ తొలి సినిమాను కూడా రాఘవేంద్ర రావు చేయాల్సిందట.

రాఘవేంద్ర రావుతో బాగా పరిచయం ఉండటంతో ప్రభాస్ తొలి సినిమాను కూడా దర్శకేంద్రుడి డైరెక్షన్ లోనే చేయించాలని అనుకున్నారట. ఐతే ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు అంతా సిద్ధం కాగా ఆ టైం లో రాఘవేంద్ర రావు వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారట. అందుకే ఆ ఛాన్స్ ని జయంతి సి పరాన్జీకి ఇచ్చారు. ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ హీరోగా కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత రెండు మూడు సినిమాలతోనే మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు.

ఐతే తాను ప్రభాస్ ని ఇంట్రడ్యూస్ చేయలేకపోయానన్న విషయాన్ని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు రాఘవేంద్ర రావు. ఒక్క సినిమా అయినా ప్రభాస్ తో చేయాల్సింది అని అన్నారు. ఐతే ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో భారీ సినిమాలు చేస్తున్నాడు. రాఘవేంద్ర రావు సినిమాలు తీయడం పూర్తిగా మానేశారు. ఒకవేళ ఏ ఆధ్యాత్మిక కథతో రావాలని అనుకున్నా ప్రభాస్ తో చేస్తాడా లేదా అన్నది పెద్ద డౌట్.

సో ప్రభాస్ రాఘవేంద్ర రావు కాంబో మొదటి సినిమా మిస్ అవ్వగా అది సాధ్యం కాదు అన్నట్టుగానే ఉంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాడు. ఈ ఇయర్ ఆల్రెడీ కల్కితో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ నెక్స్ట్ సమ్మర్ కి రాజా సాబ్ తో రాబోతున్నాడు. రాజా సాబ్ తో పాటు ఫౌజి, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 ఇలా ప్రభాస్ సినిమాల లిస్ట్ చాలా పెద్దదిగానే ఉందని చెప్పొచ్చు. సో ప్రభాస్ తో ఎవరైనా కొత్త సినిమా చేయాలి అంటే ఎలా లేదన్నా కూడా ఒక ఐదారేళ్లు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇయర్ ప్రభాస్ నుంచి రెండు సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. కానీ చూస్తుంటే అది సాధ్యమయ్యేలా లేదనిపిస్తుంది.