చిరూ సినిమాకు టైటిల్ ను సూచించిన దర్శకేంద్రుడు
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విక్టరీ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు హాజరయ్యారు.
By: Tupaki Desk | 11 Feb 2025 5:25 AM GMTవెంకటేష్ హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఎస్వీసీ బ్యానర్ లో దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విక్టరీ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాఘవేంద్ర రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరోయిన్ల నటన అద్భుతంగా ఉందని, వెంకటేష్ బయట సైలెంట్ గా కనిపించినా తెరపై ఇద్దరు హీరోయిన్లతో ఉన్నప్పుడు మాత్రం బాగా సందడి చేస్తాడని, సినిమాకు భీమ్స్ సంగీతం మెయిన్ ఎట్రాక్షన్ అని ఆయన తెలిపారు.
ఇక అనిల్ గురించి మాట్లాడుతూ, నువ్వు సంక్రాంతి సీజన్ ను వదిలిపెట్టొద్దని ఆయన సలహా ఇచ్చారు. ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయనున్న విషయం తెలిసిందే. స్వయంగా మెగాస్టార్ చిరంజీవే ఈ సినిమాను స్వయంగా అనౌన్స్ చేశాడు. దీంతో మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చే సినిమాకు టైటిల్ ను సూచించారు రాఘవేంద్ర రావు.
ఇప్పుడు ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ అందుకున్నావు. నెక్ట్స్ చిరంజీవి తో సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ తో సినిమా తీసి మరో హిట్ అందుకోమని ఆయన అనిల్ కు సూచించారు. దీంతో మెగాస్టార్ నెక్ట్స్ మూవీపై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం విశ్వంభర సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న చిరంజీవి ఆ తర్వాత అనిల్ రావిపూడితో కలిసి సినిమాను మొదలుపెట్టనున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటితో పాటూ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమా కూడా అనిల్ రావిపూడి రెగ్యులర్ జానర్ లోనే ఉంటుందని సమాచారం.