Begin typing your search above and press return to search.

బాల‌య్య ఈవెంట్లో RRR షో

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ కెరీర్ ప్ర‌యాణం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైద‌రాబాద్ హైటెక్స్‌లో భారీ ఈవెంట్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Sep 2024 6:11 AM GMT
బాల‌య్య ఈవెంట్లో RRR షో
X

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ కెరీర్ ప్ర‌యాణం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైద‌రాబాద్ హైటెక్స్‌లో భారీ ఈవెంట్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌ల్లో చిరంజీవి, వెంక‌టేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. క‌న్న‌డ రంగం నుంచి ఉపేంద్ర‌, శివ‌రాజ్ కుమార్ లాంటి స్టార్లు ఎటెండ‌వ్వ‌గా, టాలీవుడ్ నుంచి యువ‌హీరోలు హాజ‌ర‌య్యారు. కుంభ‌వృష్ఠి వ‌ర్షాల‌ను సైతం లెక్క చేయ‌క‌ ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో నంద‌మూరి అభిమానులు హాజ‌ర‌య్యారు.

ఎన్బీకే 50 వేదిక‌పై కొన్ని ఫ్రేములు ప్ర‌త్యేకంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి. వీటిలో చిరు-బాల‌య్య‌-వెంక‌టేష్ ఫ్రేమ్ యూనిక్‌గా క‌నిపించ‌గా, ఇదే వేదిక‌పై చిరు-బాల‌య్య‌తో `ఉండి` నియోజ‌క‌వ‌ర్గ‌ ఎమ్మెల్యే (ప‌.గో జిల్లా) రఘు రామకృష్ణంరాజు క‌నిపించారు. ఎన్బీకే ఈ వేడుక‌కు ఆర్‌ఆర్‌ఆర్ ని చిరున‌వ్వుతో స్వాగ‌తించారు. మిస్టర్ రఘు రామా...ఆర్.ఆర్.ఆర్.. అంటూ చిరంజీవి స‌ర‌దాగా సంభాషిస్తూ క‌నిపించారు. బాల‌య్య ఈవెంట్లో RRR షో అహూతుల‌ను ఆక‌ట్టుకుంది. లైవ్ వీక్షించిన అభిమానుల‌కు ఇది ఆట‌విడుపుగా అనిపించింది.

వైకాపా పాల‌న‌లో ర‌ఘురామ‌కృష్ణం రాజు రెబ‌లిజం, హంగామా గురించి తెలిసిందే. అధికార ప‌క్షం కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌కుండా నిరంత‌రం ఆయ‌న వెంటాడిన తీరు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇప్పుడు ఆయ‌న ఉండి ఎమ్మెల్యేగా ప్ర‌జాబాహుళ్యంలో ఉన్నారు. ఆయ‌న రాక ఎన్బీకే ఈవెంట్ కి ప్ర‌త్యేక శోభ‌ను తెచ్చింది. చిరంజీవి, బాల‌య్య ఉన్న వేడుక‌కు విచ్చేయ‌డంతో ప్ర‌జ‌ల దృష్టిని ఆయ‌న మ‌రోసారి ఆక‌ర్షించ‌గ‌లిగారు.