Begin typing your search above and press return to search.

25 ఏళ్ల సంపాద‌నంతా ఒక్క సినిమాతో పోయింది!

అయితే న‌టుడిగా చేసిన‌న్ని సినిమాలు ద‌ర్శ‌క‌, నిర్మాతగా చేయ‌లేదు.

By:  Tupaki Desk   |   2 Aug 2024 2:30 AM GMT
25 ఏళ్ల సంపాద‌నంతా ఒక్క సినిమాతో పోయింది!
X

సీనియ‌ర్ న‌టుడు గిరిబాబు సినీ ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. విల‌న్ గా, క‌మెడియ‌న్, న‌టుడిగా తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లోఎన్నో వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. ఇప్ప‌టికీ అవ కాశాలొస్తే న‌టిస్తున్నారు. న‌టుడిగానే కాదు గిరిబాబు మూడు నాలుగు సినిమాల్నిస్వ‌యంగా డైరెక్ట్ చేసారు. నిర్మాత‌గానూ ప‌నిచేసారు. అయితే న‌టుడిగా చేసిన‌న్ని సినిమాలు ద‌ర్శ‌క‌, నిర్మాతగా చేయ‌లేదు.

అలాగే ఇండ‌స్ట్రీలో గిరిబాబు వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని ర‌ఘుబాబు న‌టుడిగా రాణిస్తోన్న సంగ‌తి తెలిసిందే. త‌న‌యుడి సైతం తండ్రిలాగే న‌టుడిగా ఎంతో పేరు ఫేమ‌స్ అయ్యారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో గిరిబాబు గురించి ప‌లు విష‌యాలు పంచుకున్నారు. ఆవేంటో ఆయ‌న మాట‌ల్లోనే...' మా సొంత బ్యానర్ పై నాన్న సినిమాలు కొన్ని సినిమాలు నిర్మించారు. 1990లో తమ్ముడు హీరోగా 'ఇంద్రజిత్' సినిమాను నిర్మించాం.

అప్పట్లోనే ఆ సినిమా కోసం 50 లక్షలు ఖ‌ర్చు చేసాం. సినిమా బాగానే ఆడింది . కానీ డ‌బ్బులు మా వ‌ర‌కూ రాలేదు. ఆ సినిమా రిలీజ్ చేయ‌డానికి నాన్న చాలా ఇబ్బందులు ప‌డ్డారు. రిలీజ్ త‌ర్వాత బాగుంద‌ని టాక్ వ‌చ్చినా మా చేతికి రూపాయి రాలేదు. రాక‌పోగా భారీగా న‌ష్టాలు చూపించారు. నిజానికి సినిమా బయట పడిపోయిన తరువాత ఎవరూ ఎవరినీ పట్టించుకోరు. కానీ నాన్న గారు అలా కాదు. మాకు రూపాయి రావలసి ఉంది అంటూ ఎవరూ గేటు ముందుకు రాకూడదనేది ఆయన పద్ధతి.

'ఇంద్రజిత్' సినిమా కారణంగా వచ్చిన నష్టాలను పూడ్చడం కోసం, నాన్నగారు స్థిరాస్తులను అమ్మేశారు. ఆయన 20 - 25 సంవత్సరాలుగా సంపాదించిందంతా పోయింది. కాలం కలిసొస్తే మళ్లీ సంపాదించు కుందాం. లేదంటే ఊరు వెళ్లిపోదామని నాన్న చెప్పారు. అలా ఎన్నో ఇబ్బందులను తట్టుకుని నిల‌బ‌డ్డాం' అని అన్నారు.