తండేల్ టీమ్ కు దర్శకేంద్రుడి ప్రశంసలు..!
రిలీజైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న తండేల్ సినిమాపై సెలబ్రిటీల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
By: Tupaki Desk | 8 Feb 2025 2:43 PM GMTనాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా శుక్రవారం రిలీజైంది. గీతా ఆర్ట్స్ 2 బ్యాన లో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందిచారు. తండేల్ సినిమా నిన్న రిలీజై ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య లవ్ సీన్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. రిలీజైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న తండేల్ సినిమాపై సెలబ్రిటీల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
లేటెస్ట్ గా తండేల్ సినిమా చూసిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు సినిమాని పొగడ్తలతో ముంచెత్తారు. తండేల్ సినిమా గురించి రాఘవేంద్ర రావు ఏమన్నారు అంటే.. చాలా రోజుల తర్వాత తండేల్ లాంటి అద్భుతమైన ప్రేమకథ చూశాను.. నాగ చైతన్య, సాయి పల్లవి పోటీ పడి నటించారు. చందు మొండేటి తీసుకున్న కథ దాని నేపథ్యం సాహసోపేతమే అని అన్నారు. షాట్ మేకింగ్ పై దర్శకుడు పెట్టిన శ్రద్ధ బాగుంది. ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న గీతా ఆర్ట్స్ కి అభినందనలు.. ఒక మాటలో చెప్పాలంట్ ఇది ఒక దర్శకుడి సినిమా అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు రాఘవేంద్ర రావు.
శత చిత్రాల దర్శకుడు సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు ప్రశంసలు తండేల్ చిత్ర యూనిట్ ని సంతోషంలో ముంచెత్తుతున్నాయి. ఈ సినిమా మీద ముందు నుంచి సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు చిత్ర యూనిట్. తండేల్ సినిమా తెర మీద నాగ చైతన్య, సాయి పల్లవి అదరగొట్టగా తెర వెనుక దేవి శ్రీ ప్రసాద్ దర్శకుడు చందు మొండేటి తమ బెస్ట్ ఎఫర్ట్ పెట్టారు.
తండేల్ సినిమాతో నాగ చైతన్య బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించారు. సినిమాలో రాజు పాత్రలో చైతన్య యాక్టింగ్ చూసి ఆడియన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు. సినిమాలో దేవి మ్యూజిక్ తో పాటు నాగ చైతన్య నటన కూడా ప్రేక్షకుల హృదయాలను టచ్ చేసింది. సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకెళ్తున్న తండేల్ సినిమా వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి. ఇక రాఘవేంద్ర రావు ట్వీట్ తో సినిమా గురించి మరింత మందికి తెలిసే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.