2024 ఎన్నికలపై 'వ్యూహం' ప్రభావం!
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 'వ్యూహం సినిమా ప్రజలపై ఎంతవరకూ ప్రభావం చూపిస్తుందన్నది నాకు తెలియదు.
By: Tupaki Desk | 14 Aug 2023 5:08 AM GMTసంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోణంలో 'వ్యూహం' చిత్రాన్ని రెండు భాగాలు గా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ ప్రకటనతోనే 'వ్యూహం' సంచలనంగా మారింది. జగన్ గురించి వర్మ ఏం చెబుతున్నారు? ఎలా చెప్పబోతున్నారు? ఇందులో ఇంకేమైనా రాజకీయ పాత్రలు ఉన్నాయా? వంటి సందేహాలు తెరపైకి వచ్చాయి. తాజాగా వాటన్నింటిని వర్మ ప్రకాశం బ్యారేజీ సాక్షిగా రివీల్ చేసారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రకాశం బ్యారేజీపై జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 'వ్యూహం సినిమా ప్రజలపై ఎంతవరకూ ప్రభావం చూపిస్తుందన్నది నాకు తెలియదు. నేను నమ్మిన నిజాన్నే సినిమాలో చూపిస్తాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఎవరెవరు వారికి అనుకూలంగా ఎలాంటి వ్యూహాలు రచించారనేది కథాంశం' అన్నారు.
విపక్షాలు లక్ష్యంగా..జగన్ ని మళ్లీ సీఎం చేయడానికి సినిమా చేస్తున్నారా? అన్న ప్రశ్నకు బధులిచ్చారు. 'జగన్ ని సీఎం చేయడానికి నేను ఎవరిని? ఎన్నికలపై ప్రభావం చూపాలన్నదే నా ఉద్దేశం. సినిమా లో కేవలం నాది.. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ల వ్యూ పాయింట్స్ మాత్రమే ఉంటాయి. ఈ సినిమా వెనుక ఎవరు లేరు. కిరణ్ మాత్రమే ఉన్నారు. ఆయనకు వైపాకాపాతో ఉన్న సంబంధం ఏంటో నాకు తెలియదు.
జగన్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం చాలాసార్లు చెప్పాను. నేను జగన్ గురించి ఏమనుకుం టున్నానో? అదే సినిమాలో చూపిస్తున్నా. ఆయనతో పాటు పవన్..లోకేష్ పాత్రలు కూడా సినిమాలో ఉంటాయి. ఇంకా ఏపీ రాజకీయాల్లో ప్రధాన ఘట్టాలన్ని సినిమాలో కనిపిస్తాయి. పవన్ ..లోకేష్ పిలిచి సినిమా తీయమన్నా తీయను' అని అన్నారు. అలాగే నటుల పారితోషికం గురించి మాట్లాడుతూ.. మార్కెట్ ని బట్టి ఇవ్వడానికి నిర్మాతలు సిద్దంగా ఉన్నప్పుడు తీసుకునే వారి తప్పు ఏముంది? నటుల పారితోషికం వల్ల ప్రజలపై భారం పడదు. టికెట్ల ధరలు పెరగవు' అని అన్నారు.