ఇక్కడ అల్లు అర్హ.. అక్కడ రాహా కపూర్
చూడటానికి చిటికిన వేలెడంత లేదు.. నిండా ఇంకా నాలుగేళ్లయినా నిండలేదు. కానీ ఫాలోయింగ్ మాత్రం మామూలుగా లేదు.
By: Tupaki Desk | 28 Dec 2024 7:27 AM GMTచూడటానికి చిటికిన వేలెడంత లేదు.. నిండా ఇంకా నాలుగేళ్లయినా నిండలేదు. కానీ ఫాలోయింగ్ మాత్రం మామూలుగా లేదు. తనను పిలిచిన వారందరికీ విష్ చేస్తోంది. హాయ్! అంటే భాయ్ చెబుతోంది.. టాటా బాయ్ బాయ్ అంటూ ఫోజులిస్తోంది. తనను అదే పనిగా ఆటపట్టించే ఫోటోగ్రాఫర్లను టీజ్ చేస్తోంది. అలా మమ్మీ చంకనెక్కినా కానీ, అక్కడి నుంచే ఫోటోగ్రాఫర్లు, తనను అభిమానుల్లో అనుసరించే వారి వైపు చూస్తూ చేతులు ఊపుతోంది. పైగా గాల్లో కిస్ లు ఇస్తూ అల్లరి చేస్తూ... వామ్మోవ్ చిచ్చర పిడుగు అనడంలో సందేహం లేదు.
ఇంకా రెండేళ్లు అయినా నిండని ఆ చిన్నారి వేషాలు చూడటానికి ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ దృశ్యం ఎంతో ముచ్చటగొలుపుతోంది. ఇంతకీ ఈ ఎపిసోడ్ లో చిన్నారి ఎవరో తెలుసు కదా! పేరు రాహా కపూర్. ఆలియా భట్- రణబీర్ కపూర్ జంట గారాలపట్టీ. వందల కోట్ల ఆస్తికి ప్రస్తుతానికి ఏకైక వారసురాలు. తన తండ్రి రణబీర్ కుమార్తె రాహా కోసం ఏకంగా 200కోట్ల విలువ చేసే ఇంటిని రాసిచ్చిన విషయం తెలిసినదే.
స్వతహాగానే మమ్మీ డాడీ నుంచి స్టార్ అప్పియరెన్స్ తనకు పుట్టుకతోనే అబ్బినట్టు కనిపిస్తోంది. తను ఎక్కడ ఉంటే అక్కడ చుట్టూ వాతావరణంలో స్టార్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఈ ఏజ్ లో ఎంత చిలిపి ఎంత అల్లరి. నిజంగా స్టార్ కిడ్ రాహా ఆలియాను మించిన గడుసరి. రణబీర్ ని మించిన గడుగ్గాయ్ లా కనిపిస్తోందని అభిమానులు పొగిడేస్తున్నారు.
రాహా క్యూట్ అల్లరి వేషాలు చూస్తుంటే ఎవరికైనా ముచ్చట కలుగుతుంది. అలా అక్కడ హోటల్ రిసెప్షన్ నుంచి లోనికి వెళుతూ మామ్ డాడ్ ని మించిన ఫాలోవర్స్ ని ఆస్వాధిస్తోంది రాహా. రాహా గడుసుతనం అల్లరి చూశాక మీడియా సైతం ముచ్చటపడింది. ప్రస్తుతం రాహా చిలిపి అల్లరి చేష్ఠల వీడియోలు నిజంగా వెబ్ ని ఊపేసేంతగా వైరల్ అవుతున్నాయి. చూడటానికి అచ్చం ఆలియా భట్ లా కనిపిస్తున్న రాహాకు నిజంగా డాడీ రణబీర్ లోని అల్లరి అబ్బిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. రాహా వేషాలు చూసి ఆలియా నవ్వు ఆపుకోలేని స్థితికి చేరుకుంది.
మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కూడా అంతే చిలిపి అల్లరితో నెటిజనులను నిరంతరం ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ కిడ్స్ లో ఇలాంటి లక్షణాలు చాలా అరుదు. అలాంటి చిన్నారుల భవిష్యత్ ని ఊహిస్తే అది ఎంత వైబ్రేంట్ గా సాగుతుందో ఊహించగలం.