స్టార్ కపుల్.. కూతురికి 250 కోట్ల కానుక
ఈ భారీ బంగ్లాతో పాటు, అలియా- రణబీర్ ఇద్దరూ బాంద్రా ప్రాంతంలో నాలుగు ఫ్లాట్‌లను సొంతంగా కలిగి ఉన్నారు. వాటి విలువ రూ.60 కోట్ల కంటే ఎక్కువ.
By: Tupaki Desk | 29 March 2024 5:30 PM GMTరణబీర్ కపూర్- ఆలియా భట్ దంపతుల గారాల పట్టీ రాహా కపూర్ బాలీవుడ్ లో అత్యంత సంపన్న స్టార్ కిడ్ గా అవతరించనుంది. దానికి కారణం ఈ జంట తమ కుమార్తెకు రూ.250 కోట్ల విలువ చేసే బంగ్లాను బహుమతిగా ఇవ్వనున్నారు. ఇప్పటికే డాక్యుమెంట్లు రెడీ అవుతున్నాయనేది బాలీవుడ్ గుసగుస.
రణ్‌బీర్-ఆలియా ఇద్దరూ కష్టపడి సంపాదించిన డబ్బును తమ కలల గృహాన్ని నిర్మించడానికి సమానంగా పెట్టుబడి పెడుతున్నారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యేలోపు రూ. 250 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. షారూఖ్ ఖాన్ మన్నత్, అమితాబ్ బచ్చన్ జల్సాతో పోలిస్తే ఇది ముంబై ప్రాంతంలో అత్యంత ఖరీదైన బంగ్లా అవుతుంది. తన కుమార్తె రాహా కపూర్‌తో పిచ్చిగా ఘాఢంగా ప్రేమలో ఉన్న రణబీర్ కపూర్ తన పేరునే బంగ్లాకు పెడతానని ప్రకటించాడు. దీంతో రాహా కపూర్ బి-టౌన్‌లో అత్యంత ధనవంతురాలైన స్టార్ కిడ్‌గా అవతరించనుంది. ఈ భారీ బంగ్లాతో పాటు, అలియా- రణబీర్ ఇద్దరూ బాంద్రా ప్రాంతంలో నాలుగు ఫ్లాట్‌లను సొంతంగా కలిగి ఉన్నారు. వాటి విలువ రూ.60 కోట్ల కంటే ఎక్కువ.
దివంగత నటుడు, రణబీర్ తండ్రి రిషి కపూర్ తన ఆస్తులన్నింటికీ తన భార్య నీతూజీని సగం యజమానిగా మార్చినందున ఆమె రాహాతో ఖరీదైన బంగ్లాకు సహ యజమానిగా ఉంటుంది. నీతూ జీ స్వయంగా ఆర్థికంగా చాలా స్థిరంగా ఉన్నారు. ఇటీవల ఆమె బాంద్రా ప్రాంతంలోనే 15 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేసారు. బంగ్లా సిద్ధమైన తర్వాత కపూర్ ఖాందాన్ అంతా ఒకే ఇంట్లో జీవిస్తారని కూడా ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతం అలియా - రణబీర్ రాహాతో కలిసి 'వాస్తు'లో నివసిస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... రణబీర్ కపూర్ తదుపరి 'రామాయణం'లో నటించాల్సి ఉంది. అలాగే సందీప్ వంగాతో యానిమల్ పార్క్ 2025లో సెట్స్ కెళ్లే వీలుంది. అలియా భట్ తదుపరి చిత్రం జిగ్రాతో అభిమానుల ముందుకు రానుంది.