విడాకులకు హ్యాష్‌ట్యాగ్ ఏంటి రెహమాన్?
దీనికి ఓ హ్యాష్ ట్యాగ్ ను కూడా క్రియేట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
By: Tupaki Desk | 20 Nov 2024 5:50 AM GMTఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్, ఆయన భార్య సైరా బాను విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ తమ 29 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. సడన్ గా రెహమాన్ తన భార్యకు డివోర్స్ ఇస్తున్నారని అనౌన్స్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక విడాకులపై ఏఆర్ రెహ్మాన్ స్పందిస్తూ సోషల్ మీడియా ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. దీనికి ఓ హ్యాష్ ట్యాగ్ ను కూడా క్రియేట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
''మేము గ్రాండ్ గా 30 ఏళ్ల వైవాహిక బంధానికి చేరుకోవాలని ఆశించాము. కానీ కొన్ని విషయాలు అనుకోని ముగింపును కలిగి ఉంటాయి. విరిగిన హృదయాల బరువుకు దేవుని సింహాసనం కూడా వణుకుతుంది. అయినప్పటికీ దీనిలో మేము కొత్త అర్థాన్ని వెతుకుతాము. ఈ విరిగిన ముక్కలు మళ్లీ వాటి యదా స్థానాన్ని కనుగొనలేవు. మేము ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతున్నందున, మా స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు'' అని ఏఆర్ రెహమాన్ పోస్ట్ చేసారు. దీనికి #arrsairaabreakup అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడించారు.
విడాకులు తీసుకోవడం అనేది ఎవరి జీవితంలో అయినా చాలా కఠినమైన క్షణాలే. అందులోనూ దాదాపు ముప్పై ఏళ్ళు కలుసున్న దంపతులు విడిపోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ ఇక్కడ ఏఆర్ రెహమాన్ డివోర్స్ ను ఏదో సెలబ్రేషన్స్ మాదిరిగా #arrsairaabreakup అంటూ హ్యాష్‌ట్యాగ్ పెట్టడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దిగ్గజ సంగీత దర్శకుడు ప్రైవసీ కోరుకుంటున్నాడు కానీ, అతను విడిపోవడానికి హ్యాష్‌ట్యాగ్ ను క్రియేట్ చేస్తున్నాడు అంటూ విమర్శిస్తున్నారు.
విడాకులు ప్రకటించడానికి హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు, తనకు ప్రైవసీ కావాలని అడగడం అనేది అల్టిమేట్ బూమర్ బిహేవియర్ అని ఓ నెటిజన్ కామెంట్ చెప్పాడు. ఏఆర్ రెహమాన్ కు ఎమోషన్స్, ఫీలింగ్స్ కంటే హ్యాష్‌ట్యాగ్‌లు చాలా ముఖ్యమైనవి అయ్యాయంటూ మరొకరు స్పందించారు. అయితే ఇది రెహ్మాన్ అడ్మిన్ టీమ్ పోస్ట్ చేసి ఉండొచ్చని, హ్యాష్‌ట్యాగ్ క్రియేట్ చేయడం ఆయనకు తెలియకుండా జరిగి ఉండొచ్చని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ఏఆర్ రెహమాన్ - సైరా బానుల విడాకుల హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
ఏఆర్ రెహమాన్, సైరా బాను 1995లో షాదీ చేసుకున్నారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. వీళ్లకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇన్నేళ్ళు భార్యాభర్తలుగా సంతోషకరమైన జీవితం గడిపిన రెహ్మాన్ - సైరా, ఉన్నట్టుండి విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పటికీ, భావోద్వేగపూరిత ఒత్తిడి కారణంగా ఎంతో బాధతో, వేదనతో విడిపోతున్నట్లు వారి లాయర్లు ప్రకటించారు.
రెహ్మాన్ - సైరా విడాకులపై వారి పిల్లలు రహీమా, ఖతీజా, అమీన్ సోషల్ మీడియాలో స్పందించారు. మా తల్లిదండ్రుల విడాకుల విషయంలో ప్రైవసీ పాటిస్తూ, గౌరవంగా వ్యవహరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అని రహీమా పోస్ట్ పెట్టింది. ఈ కఠిన సమయంలో మా కుటుంబ గోప్యతను గౌరవించాలని మేము ప్రతిఒక్కరినీ వేడుకుంటున్నాం. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు అని ఖతీజా, అమీన్ పేర్కొన్నారు.