రోజా, బొంబాయి రేంజ్ లో మరోసారి రెహమాన్!
సినిమాలు తగ్గించి మ్యూజిక్ కాన్సెర్ట్ లు చేయడం ఓ కారణమైతే చేసిన సినిమాల్లో కూడా పసలేని సంగీతం అందించడం అన్నది మరో కారణం.
By: Tupaki Desk | 18 Feb 2025 9:30 PM GMTస్వరమాంత్రికుడు ఏ. ఆర్ రెహమాన్ నుంచి సరైన మ్యూజిక్ ఆల్బమ్ విడుదలై కొన్ని సంవత్సరాలు గడుస్తోంది. రెండు దశాబ్ధాలుగా రెహమాన్ బ్రాండ్ నేమ్ అంతగా వినిపించడం లేదు. సినిమాలు తగ్గించి మ్యూజిక్ కాన్సెర్ట్ లు చేయడం ఓ కారణమైతే చేసిన సినిమాల్లో కూడా పసలేని సంగీతం అందించడం అన్నది మరో కారణం. ఆ మధ్య రిలీజ్ అయిన ఓ మలయాళ చిత్రం 'ది గోట్ లైఫ్' లో ఓ మెలోడీ సాంగ్ తో బౌన్స్ బ్యాక్ అయ్యారనిపించినా? తర్వాత కంటున్యూ చేయలేదు.
రెహమాన్ సంగీతం విషయంలో శ్రోతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ? అన్నది వాస్తవం. 'రోజా', 'బోంబాయి' రేంజ్ మ్యాజిక్ ఎక్కడ? అంటూ రెహమాన్ ని సోషల్ మీడియా వేదికగా నిరతంరం ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ రెహమాన్ మాత్రం అందుకు బధులివ్వలేదు. అలాగే రెహమాన్ కూడా లవ్ స్టోరీలకు సంగీతం అందించడం అన్నది కూడా చాలా కాలంగా జరగలేదు. డిఫరెంట్ జానర్ సినిమాలకు పని చేయడంతో? ఆయన మ్యూజికల్ లో సెన్సిబుల్స్ తగ్గిపోతున్నాయి? అన్న విమర్శ కూడా చాలా కాలంగా ఎదుర్కుంటున్నారు.
మ్యూజిక్ పరంగా అత్యాధునిక పరికరాలు వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో శ్రుతి, లయ తప్పుతుందనే వాదన ఉంది. అయితే రెహమాన్ అన్ని విమర్శలకు చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. చాలా కాలం తర్వాత రెహమాన్ బాలీవుడ్ లో ఓ క్లాసిక్ లవ్ స్టోరీకి సంగీతం అందిస్తున్నారు. అదే ధనుష్ హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కిస్తోన్న 'తేరే ఇష్క్ మే'. ఇది ప్యూర్ లవ్ స్టోరీ.
కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెహమాన్ ఈ సినిమాకి ది బెస్ట్ ఆల్బమ్ కంపోజ్ చేస్తున్నాడని బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఒకప్పుడు మ్యూజిక్ సెన్షేషన్ ఈ సినిమాలో కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది. కొన్ని క్లాసిక్, మెలోడీ ట్యూన్స్ తో శ్రోతల్ని మరోసారి తన సంగీతం ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాడని కథనాలు వెలువడుతున్నాయి.