సర్జరీ అసోసియేషన్ పై రెహమాన్ 10 కోట్లు దావా!
తాజాగా ఇరువురి మధ్య లీగల్ వార్ మొదలైనట్లు తెలుస్తోంది. లాయర్ పబ్నం ద్వారా రెహామాన్ కి నోటీసులు వెళ్లాయి.
By: Tupaki Desk | 4 Oct 2023 7:06 AM GMTమ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్ రెహమాన్- ఇండియన్ సర్జరీ అసోసియేష్ మధ్య కచేరి వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. చెన్నైలో కచేరి నిర్వహించేలా అగ్రిమెంట్ చేసుకోవడంతో సర్జరీ అసోసియేషన్ రెహమాన్ కి 29 లక్షలు చెల్లించారని...కానీ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో ఆ డబ్బు తిరిగివ్వలేదని సర్జరీ ఆసోసియేషన్ ఆరోపించింది. దీనిలో భాగంగా రెహమాన్ పై చెన్నై మెట్రో పాలిటిన్ పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేసింది.
తాజాగా ఇరువురి మధ్య లీగల్ వార్ మొదలైనట్లు తెలుస్తోంది. లాయర్ పబ్నం ద్వారా రెహామాన్ కి నోటీసులు వెళ్లాయి. ప్రతిగా హైకోర్టు న్యాయవాది నర్మదా సంప్ రెహమాన్ తరుపున తిరిగి అసోసియేషన్ కి నోటీసులు పంపించారు. అందులో రెహమాన్ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కుట్రపన్నుతున్నారుని పేర్కొన్నారు. పబ్లిసిటీ కోసమే ఇలా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
రెహమాన్ కి వారు ఇచ్చిన డబ్బు అందలేదని అన్నారు. రెహమాన్ తో సంబంధం లేని మూడో వ్యక్తికి డబ్బులిచ్చి ఇండియన్ సర్జరీ అసోసియేషన్ అనవసరంగా వివాదంలోకి రెహమాన్ ని లాగుతున్నారని ఆరోపించారు.
రెహమాన్ కి పంపిచిన నోటీసుల్ని మూడు రోజుల్లో ఉపసంహరించుకోవాలని..ఆయనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. సర్జరీ ఆసోసియేషన్ పై పది కోట్లు పరువు నష్టం దావా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇకపై చట్టపరమైన చర్యలకు తాము సిద్దంగానే ఉన్నామని.. క్రిమినల్ చర్యలు తప్పవని నోటీసు ద్వారా లాయర్ హెచ్చరించారు. దీంతో ఈ వివాదం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే రెహమాన్ తిరిగి చెల్లించిన చెక్ బౌన్స్ అయిందని కూడా సర్జరీ అసోసియేషన్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో రెహమాన్ తరుపు లాయర్ ఎంట్రీ తో సన్నివేశం రసవత్తంగా మారింది. కేసులో కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి.