తొక్కిసలాట ఘటన.. రాహుల్ రామకృష్ణ యూటర్న్!
ఆ కేసులోనే బన్నీ అరెస్ట్ అయ్యి.. హైకోర్టు ఇచ్చిన బెయిల్ పై బయటకు వచ్చారు.
By: Tupaki Desk | 23 Dec 2024 5:22 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప-2 ప్రీమియర్ షో సమయంలో హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ మృత్యువుతో పోరాడుతున్నారు. ఆ కేసులోనే బన్నీ అరెస్ట్ అయ్యి.. హైకోర్టు ఇచ్చిన బెయిల్ పై బయటకు వచ్చారు.
మొత్తానికి తొక్కిసలాట ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు.. అదే రోజు రాత్రి ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ చెప్పిన విషయాలు.. ఈ రెండు ఘటనలు తర్వాత అప్పు ఎవరిదోనని అంతా మాట్లాడుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.
అదే సమయంలో నటుడు రాహుల్ రామకృష్ణ సంచలన ట్వీట్ చేశారు. జరిగిన ఘటనపై తనకు చాలా తప్పుడు సమాచారం అందిందని, అందుకే తాను చేసిన కామెంట్లు వెంటనే వెనక్కి తీసుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. దీంతో ఆయన పోస్ట్ వైరల్ గా మారగా.. రాహుల్ పోస్ట్ వెనుక కారణమేంటోనని నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు.
అయితే రాహుల్ రామకృష్ణ.. చివరగా బన్నీ అరెస్ట్ సమయంలోనే కామెంట్స్ చేశారు. ఘటనలో ఒక్కరినే ఎలా బాధ్యుల్ని చేస్తారని ప్రశ్నించారు. అల్లు అర్జున్ కు మద్దతు తెలిపారు. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. సినిమా థియేటర్లు పబ్లిక్ స్పేస్ లు అని, అలాంటి చోటుకు సినీ తారలు హాజరయినప్పుడు పోలీసులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
ఊరేగింపులు, పండుగలు, రాజకీయ ర్యాలీలు జరిగిన సమయంలో కూడా ఇప్పటికే ఎంతో మంది మరణించారని, ఆ సంఘటనల సమయంలో ఇంత స్పీడ్ గా ఎందుకు స్పందించలేదని అడిగారు. అయితే ఇప్పుడు తన కామెంట్స్ ను వెనక్కి తీసుకుంటున్నానని రాహుల్ రామకృష్ణ చెప్పగా.. అందరికీ అసలు విషయం అర్థమైపోతుంది.
బన్నీ విషయంలో ఆయన యూటర్న్ తీసుకున్నట్లు క్లియర్ గా కనబడుతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అప్పుడు అలా అడిగిన ఆయన.. ఇప్పుడు ఇలా ట్వీట్ చేయడం షాకింగ్ గా ఉందని చెబుతున్నారు. అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదని అంటున్నారు. కొందరు ఆయనకు సపోర్ట్ గా.. మరికొందరు యాంటీగా స్పందిస్తున్నారు. మరి రాహుల్ రామకృష్ణ కొత్త ట్వీట్ పై అల్లు అర్జున్ అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.