Begin typing your search above and press return to search.

రౌడీ హీరో నో కాంప్రమైజ్..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీ ఫ్యామిలీ స్టార్ అంచనాలను అందుకోలేకపోయింది.

By:  Tupaki Desk   |   24 Jun 2024 9:44 AM GMT
రౌడీ హీరో నో కాంప్రమైజ్..?
X

రౌడీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీ ఫ్యామిలీ స్టార్ అంచనాలను అందుకోలేకపోయింది. ఖుషి తో కాస్త పర్వాలేదు అనిపించుకున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లాంటి సబ్జెక్ట్ ఎంచుకోవడం అతని ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేసింది. గీతా గోవిందం లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కాబట్టి అతని మీద కాన్ఫిడెన్స్ తో వెళ్లిపోయాడు విజయ్. ఐతే పరశురాం మీద విజయ్ పెట్టుకున్న నమ్మకాన్ని డైరెక్టర్ నిలబెట్టుకోలేకపోయాడు. ఈ సినిమా ప్రమోషన్స్ టైం లోనే కొత్త వారితో సినిమాలు చేయనని అన్న విజయ్ స్టేట్ మెంట్ ని రాంగ్ రూట్ లో తీసుకెళ్లారు.

ఐతే విజయ్ కూడా ఒకప్పుడు కొత్త వాడే కదా అని విమర్శించారు. విజయ్ కొత్త వారిని ఎంకరేజ్ చేయకూడదనే ఉద్దేశంతో ఆ మాట అనలేదు. తనకున్న మార్కెట్ కొద్దీ నిర్మాతలు ఎక్కువ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నప్పుడు సినిమాను బాగా హ్యాండిల్ చేసే విధంగా ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడైనా చాలని అన్నాడు. సినిమా తీస్తే చాలు అది హిట్టా ఫ్లాపా కాదు తనకు నచ్చిన కథ తెస్తే అతనితో సినిమా చేస్తానని అన్నాడు విజయ్ దేవరకొండ.

ఫ్యామిలీ స్టార్ తర్వాత గౌతం తిన్ననూరితో ఒక సినిమా చేస్తున్న విజయ్ ఆ తర్వాత రవికిరణ్ కోలా, రాహుల్ సంకృత్యన్ లాంటి దర్శకులను లైన్ లో పెట్టాడు. రాహుల్ సంకృత్యన్ తో విజయ్ చేసే సినిమా పీరియాడికల్ కథతో వస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ టాక్సీవాలా సినిమాతో కలిసి సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ, రాహుల్ మరోసారి ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తున్నారు.

ఈ సినిమా కథ కథనం అంతా కూడా రాహుల్ భారీ ప్లానింగ్ తో వస్తున్నాడని తెలుస్తుంది. అంతేకాదు విజయ్ దేవరకొండ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయే సినిమాగా ఇది ఉంటుందని అంటున్నారు. ఆల్రెడీ రెండు సినిమాలతో రాహుల్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి విజయ్ దేవరకొండకి హిట్ పక్కా అని చెప్పొచ్చు. విజయ్ కూడా ఈ సినిమాకు తన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేందుకు రెడీ అవుతున్నాడట. గౌతం తిన్ననూరి సినిమా పూర్తి కాగానే రాహుల్ సినిమా మొదలవుతుంది తెలుస్తుంది.