Begin typing your search above and press return to search.

వంద‌ల కోట్ల ఆస్తులతో అశిన్ లైఫ్‌స్టైల్ స్కైలో!

అయితే అసిన్ జనవరి 2016లో తన వివాహం తర్వాత చిత్ర పరిశ్రమను విడిచిపెట్టారు.

By:  Tupaki Desk   |   22 May 2024 3:15 AM GMT
వంద‌ల కోట్ల ఆస్తులతో అశిన్ లైఫ్‌స్టైల్ స్కైలో!
X

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు అశిన్. ఈ కేర‌ళ కుట్టి త‌న‌దైన అందం అభిన‌యంతో సౌత్ ఇండ‌స్ట్రీలో అగ్ర‌క‌థానాయిక‌గా ఓ వెలుగు వెలిగింది. గ‌జిని- అమ్మ నాన్న త‌మిళ‌మ్మాయి- అన్న‌వ‌రం- శివ‌మ‌ణి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించింది. బాలీవుడ్ లో ను అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌నా న‌టించింది. సల్మాన్ ఖాన్‌తో రెడీ, అమీర్ ఖాన్‌తో గజిని, అక్షయ్ కుమార్‌తో హౌస్‌ఫుల్ 2 చిత్రాలలో తన అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.


అయితే అసిన్ జనవరి 2016లో తన వివాహం తర్వాత చిత్ర పరిశ్రమను విడిచిపెట్టారు. అసిన్ బాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు అక్ష‌య్ కుమార్ స్నేహితుడు, ప్ర‌ముఖ‌ పారిశ్రామికవేత్త రాహుల్ శర్మను పెళ్లాడారు. అత‌డు మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు కం CEO.

ఫోర్బ్స్, GQ లో వివ‌రాల ప్ర‌కారం.. రాహుల్ శర్మ తన స్నేహితులు రాజేష్ అగర్వాల్, వికాస్ జైన్, సుమీత్ అరోరాలతో కలిసి 2000లో మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్‌ను స్థాపించారు. ప్రారంభంలో ఇది IT సాఫ్ట్‌వేర్ కంపెనీ.. ఢిల్లీకి చెందిన ఈ సంస్థ 2008లో మొబైల్ ఫోన్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. 2010 నాటికి హ్యూ జాక్‌మన్ బ్రాండ్ అంబాసిడర్‌గా భారతదేశపు సరసమైన ఫోన్‌ల తయారీదారులలో ఒకటిగా మారింది.

జీ న్యూస్ లో ఒక క‌థ‌నం ప్ర‌కారం.. శర్మ త‌న తండ్రి నుండి రూ. 3 లక్షల అప్పు తీసుకుని ఐటీ ప‌రిశ్ర‌మ‌లో వ్యవస్థాపకుడిగా ప్రయాణం ప్రారంభించాడు. నేడు రాహుల్ శర్మ నికర ఆస్తుల విలువ దాదాపు రూ.1300 కోట్లు. అతడు రాష్ట్రసంత్ తుకాడోజీ మహారాజ్ నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని, కెనడాలోని సస్కట్చేవాన్ విశ్వవిద్యాలయం నుండి కామ‌ర్స్ లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. మైక్రోమ్యాక్స్‌తో పాటు 2017లో భారతదేశపు మొట్టమొదటి AI-ఆధారిత ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రివోల్ట్ ఇంటెల్లికార్ప్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ.

ప్రేమకథలో బాలీవుడ్ స్టార్ పాత్ర

హౌస్‌ఫుల్ 2లో అసిన్‌తో కలిసి నటించిన అక్షయ్ కుమార్ 2012లో తన సన్నిహితుడు రాహుల్ శర్మకు అశిన్ ను పరిచయం చేసాడు. అక్ష‌య్ కుమార్ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ప్రేమాయ‌ణానికి వార‌ధి. వారి వివాహానికి ఉత్త‌మ‌ స‌హ‌కారి. రాహుల్- అశిన్ జంటకు ఇప్పుడు అరిన్ రేన్ అనే కుమార్తె ఉంది.

రాహుల్ శర్మ-అసిన్ లగ్జరీస్ లైఫ్ స్టైల్ అన్నివేళ‌లా హాట్ టాపిక్. ఈ జంట‌ ఢిల్లీలోని ఒక గ్రాండ్ ఫామ్‌హౌస్‌లో నివసిస్తూ విలాసవంతమైన జీవనశైలిని గడుపుతున్నారు. బెంట్లీ సూపర్‌స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్, BMW X6, మెర్సిడెస్ GL450, రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 సహా అద్భుతమైన విలాసవంతమైన కార్లను సొంతం చేసుకున్నారు.