Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : క్లోజప్‌ లో రాయ్‌ బికినీ షో

కాల క్రమేనా ఈ అమ్మడు తన పేరును రాయ్ లక్ష్మి గా మార్చుకుంది.

By:  Tupaki Desk   |   26 Jun 2024 5:03 AM GMT
పిక్ టాక్ : క్లోజప్‌ లో రాయ్‌ బికినీ షో
X

20 ఏళ్ల క్రితం కాంచన మాల కేబుల్‌ టీవీ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ లక్ష్మి రాయ్. కాల క్రమేనా ఈ అమ్మడు తన పేరును రాయ్ లక్ష్మి గా మార్చుకుంది. కెరీర్‌ ఆరంభం నుంచి కూడా పెద్ద హిట్స్‌, బ్లాక్‌ బస్టర్ సినిమాల్లో ఈ అమ్మడు నటించలేదు.


అడపా దడపా వస్తున్న ఆఫర్లు సద్వినియోగం చేసుకుంటూ, అందాల ఆరబోత చేస్తూ రాయ్ లక్ష్మి ఈ ఇరవై ఏళ్ల సినీ కెరీర్ ను కొసాగించింది. అందాల విషయంలో ఈ అమ్మడు గతంలో కంటే ఇప్పుడే బాగుంది, అప్పటికంటే ఇప్పుడే ఇంకాస్త అందంగా కనిపిస్తుందని కూడా కొందరు అంటూ ఉన్నారు.


ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ లో కూడా సందడి చేస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో ఆ స్థాయి లో అందాల ప్రదర్శన చేస్తూ నెటిజన్స్ ని ఆకట్టుకుంటూ ఉంది. రెగ్యులర్ గా బికినీ షో చేసే ఈ అమ్మడు మరోసారి క్లోజప్‌ లో తన బికినీ అందాలను చూపించి అందరి దృష్టిని ఆకర్షించింది.


బీచ్ లో సరదాగా చిల్‌ అవుతున్న రాయ్ లక్ష్మి బికినీ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ స్థాయిలో అందంగా ఉండటం వల్లే ఈ వయసులో కూడా బాలీవుడ్‌ లో ఆఫర్లను సొంతం చేసుకుంటుంది అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


మరో పదేళ్ల పాటు రాయ్ లక్ష్మి అందాల విందు, జోరు కొనసాగడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాయ్ లక్ష్మి ఒక తమిళ సినిమాతో పాటు హిందీ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది.