Begin typing your search above and press return to search.

సరిపోదా శనివారం.. వర్షాలు ఇబ్బంది పెడుతున్నా...

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. రీసెంట్ గా సరిపోదా శనివారం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   31 Aug 2024 7:22 AM GMT
సరిపోదా శనివారం.. వర్షాలు ఇబ్బంది పెడుతున్నా...
X

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. రీసెంట్ గా సరిపోదా శనివారం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఆ సినిమాతో నాని హ్యాట్రిక్ హిట్ కొట్టేశారు. గత ఏడాది దసరా, హాయ్ నాన్న మూవీస్ తో హిట్స్ అందుకున్న ఆయన.. ఇప్పుడు మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. యాక్షన్ డ్రామాగా వచ్చిన సరిపోదా శనివారం మూవీ.. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో అలరిస్తోంది.

సినిమాలో నాని తన యాక్షన్ తో ఓ రేంజ్ లో ఆకట్టుకున్నారు. సూర్య రోల్ లో ఒదిగిపోయి ప్రేక్షకులను అలరించారు. దీంతో అటు సినీ ప్రియులు.. ఇటు క్రిటిక్స్ నుంచి వేరే లెవెల్ లో ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే భారీ ఓపెనింగ్స్ సాధించిన సరిపోదా శనివారం.. వరల్డ్ వైడ్ గా ఇప్పుడు దూసుకుపోతోంది. బ్లాక్ బస్టర్ హిట్ దిశగా పయనిస్తోంది. రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి రాణిస్తోంది.

అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నా.. నాని మ్యానియా ఎక్కడా తగ్గడం లేదు. వానలు ఇబ్బంది పెడుతున్నా.. ప్రేక్షకులు మూవీని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లకు తరలివెళ్తున్నారు. సాలిడ్ వసూళ్లు వస్తున్నాయి. ఇండియాతోపాటు ఓవర్సీస్ లో మంచి కలెక్షన్లు రాబడుతోంది చిత్రం. మిగతా చిత్రాలతో ఎలాంటి పోటీ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా కూడా సరిపోదా శనివారం మూవీ హిట్ అవ్వడం పక్కాగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు ఓవరాల్ గా రూ.41 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. దీంతో రూ.42 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. రూ.28 కోట్ల షేర్ వసూలు చేస్తే మూవీ క్లీన్ హిట్ అయినట్లే. ఇప్పుడు ఉన్న రెస్పాన్స్ చూస్తుంటే.. కచ్చితంగా హిట్ అవ్వనుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. వీకెండ్ అయ్యే లోపు బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేస్తుందని అంటున్నారు.

అయితే సినిమాలో కోలీవుడ్ నటుడు ఎస్ జే సూర్య విలన్ గా అదరగొట్టేశారు. అభిరామి, అదితి బాలన్, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, మురళీశర్మ, అజయ్ ఘోష్ తదితరులు తమ పాత్రలతో మెప్పించారు. హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్‌ తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. జేక్స్ బిజోయ్.. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అలరించారు. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన సరిపోదా శనివారం మూవీని మీరు చూశారా?