Begin typing your search above and press return to search.

రాయ్ పూర్ బ్యూటీ అన్నింటికి రెడీ!

ఈ సినిమాతో ఎలాగైనా స‌క్సెస్ అందుకుని టాలీవుడ్ లో బిజీ అవ్వాల‌ని చూస్తోంది.

By:  Tupaki Desk   |   27 Feb 2024 6:39 AM GMT
రాయ్ పూర్ బ్యూటీ అన్నింటికి రెడీ!
X

'ప్రేమ్ కుమార్' చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన రాశీసింగ్ సుప‌రిచిత‌మే. అమ్మ‌డికి తొలి సినిమా పెద్ద‌గా గుర్తింపు అంటూ తీసుకురాలేదు కానీ..అమ్మ‌డి అందానికి కుర్రాళ్లంతా బాగానే ఫిదా అయ్యారు. ఈ నేప‌థ్యంలో రెండ‌వ ఛాన్స్ ఈజీ అయింది. ప్ర‌స్తుతం అమ్మ‌డు 'భూత‌ద్దం భాస్క‌ర్ నారాయ‌ణ' చిత్రంలో న‌టిస్తోంది. ఇందులో అమ్మ‌డు శివ కందుకూరికి జోడీగా న‌టిస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా స‌క్సెస్ అందుకుని టాలీవుడ్ లో బిజీ అవ్వాల‌ని చూస్తోంది.


సినిమా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నాలు చేసే ప్రోస‌స్ లో భాగంగా అమ్మ‌డు ఏకంగా ముంబై నుంచి హైద‌రాబాద్ కి ఫ్యామిలీనే షిప్ట్ చేసేసింద‌ట‌. ఈ విష‌యాన్ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసింది. తెలుగు సినిమాతో పాటు భాష‌పై త‌న‌కున్న మ‌మ‌కారంతో చేస్తే ఇక్క‌డ సినిమాలే చేయాల‌ని ఈ ప‌నిచేసి న‌ట్లు చెప్పుకొచ్చింది. ఈ సంద‌ర్భంగా అమ్మ‌డు పుట్టుపుర్వోత్త‌రాలు ఇత‌ర విష‌యాలు పంచుకుంది. ఆవేంటో ఆమె మాట‌ల్లోనే..

'మాది రాయ్పూర్ . ఢిల్లీ యూనివ‌ర్శిటీలో చ‌దువుకున్నా. ఇండ‌స్ట్రీకి వ‌చ్చే ముందు ఏడాది పాటు ఎయిర్ హోస్ట‌స్ ఉద్యోగం చేసాను. సినిమాలంటే చిన్న‌ప్ప‌టి నుంచి ఆస‌క్తి. అందుకు త‌గ్గ‌ట్టు శ్ర‌మించి ప్రేమ్ కుమార్ లో తొలి అవ‌కాశం అందుకున్నా. ఆహాలో రిలీజ్ అయిన 'పాపం ప‌సివాడు'లోనూ న‌టించాను. సుహాస్ తో క‌లిసి మ‌రో సినిమా చేసాను. అది త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. మొద‌ట్లో ముంబైలో ఉండేవాళ్లం. ఇప్పుడు కుటుంబంతో పాటు హైద‌రాబాద్ కి వ‌చ్చేసాను. ప‌రిశ్ర‌మ అంత బాగా న‌చ్చింది.

తెలుగు చ‌క్క‌గా మాట్లాడ‌గ‌ల‌ను. ఓ మంచి ల‌వ్ స్టోరీ చేయాల‌ని ఉంది. క‌థ‌లు న‌చ్చితే ఎలాంటి ప‌రిమి తులు పెట్టుకోకుండా న‌టిస్తా. గ్లామ‌ర్ ప్ర‌ధానంగా సాగే పాత్ర‌ల‌కు వెనుక‌డ‌గు వేయ‌ను. న‌టిగా అన్ని ర‌కాల పాత్ర‌లు పోషించాలి. సాహ‌సోపేత‌మైన పాత్ర‌లు చేయ‌డానికి సిద్దంగా ఉన్నాను' అంది. మొత్తానికి రాయ్ పూర్ బ్యూటీ న‌టిగా ఎలాంటి పాత్ర‌లు పోషించ‌డానికైనా రెడీగా ఉంద‌ని గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది. మ‌రి ఇండస్ట్రీ ఎలాంటి అవ‌కాశాలు క‌ల్పించి ప్రోత్స‌హిస్తుందో చూడాలి.