Begin typing your search above and press return to search.

మైండ్ బ్లాక్ చేసే ప్లాన్‌తో రాజ్ & డీకే

ఈ ఫ్రాంఛైజీలో రెండు సీజ‌న్ లు సంచ‌ల‌న విజ‌యం సాధించ‌గా, ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ 3 తెర‌కెక్కుతోంది.

By:  Tupaki Desk   |   13 Oct 2024 7:30 PM GMT
మైండ్ బ్లాక్ చేసే ప్లాన్‌తో రాజ్ & డీకే
X

ఒక‌ప్పుడు టీవీ సీరియ‌ళ్ల మేధావుల‌ను భ‌రించాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడు ఆ అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై సినిమాల‌ను మించిన క్రియేటివిటీతో సినిమాటిక్ ప్రెజెన్స్ తో వెబ్ సిరీస్ ల‌ను వీక్షించే వెసులుబాటు ఉంది. ఓటీటీ సిరీస్ ల‌ను విజ‌య‌వంత‌మైన సీరియ‌ళ్లు(అనంతంగా సాగేవి)గా మార్చిన మేధావులుగా రాజ్ అండ్ డీకే వంటి ప్ర‌బుద్ధుల‌ను పొగ‌డ‌కుండా ఉండ‌లేం. అస‌లు సినిమాల‌తో ప‌నేం ఉంది.. వెబ్ సిరీస్ లు ఉండ‌గా! అనుకునేంత‌గా రాజ్ అండ్ డీకే ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ ని న‌డిపించారు. ఈ ఫ్రాంఛైజీలో రెండు సీజ‌న్ లు సంచ‌ల‌న విజ‌యం సాధించ‌గా, ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ 3 తెర‌కెక్కుతోంది.

ఇంత‌లోనే ఇప్పుడు ఫ్యామిలీమ్యాన్ వ‌ర్సెస్ హ‌నీ బ‌న్ని (సిటాడెల్) క్రాస్ ఓవ‌ర్ గురించిన ఆస‌క్తిక‌ర చ‌ర్చకు తెర లేచింది. దీనికి కార‌ణం రాజ్ అండ్ డీకే రిలీజ్ చేసిన ఉత్కంఠ‌భ‌రిత‌మైన క్రాస్ ఓవ‌ర్ టీజర్. ప్రైమ్ వీడియో అధికారిక ఇన్‌స్టా పేజీ ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్, శ్రీకాంత్ తివారీ - JK పాత్ర‌ల‌తో ఒక‌ వీడియోను పోస్ట్ చేసింది, ఇందులో మనోజ్ బాజ్‌పేయి - షరీబ్ హష్మీ మ‌ధ్య సంభాష‌ణ‌లు ర‌క్తి క‌ట్టించాయి. ఈ జోడీ భ‌విష్య‌త్ సిరీస్ ఎలా ఉండ‌బోతోందో రివీల్ చేసే సంభాష‌ణ‌ల‌తో హీట్ పెంచారు. వారు ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్‌లో కనిపించిన చెల్లం సర్ నుండి ఫైల్‌ను క‌నుగొన్నారు. ఫైల్‌లో సిటాడెల్ ప్రపంచం గురించిన స‌మాచారం ఆస‌క్తిని పెంచుతుంది. ఆ ఇద్ద‌రూ ఫైల్ లో హ‌నీ - బ‌న్నీ డీటెయిల్స్ చ‌దివి ఆశ్చ‌ర్య‌పోతారు. తమను తాము హనీ అండ్ బన్నీతో పోల్చుకుంటూ ఒకరితో ఒకరు స‌ర‌దా సంభాష‌ణ‌లు సాగించ‌డం ప్రారంభిస్తారు.

సమంతా రూత్ ప్రభు - వరుణ్ ధావన్ నటించిన హనీ అండ్ బన్నీ గురించిన ప్ర‌స్థావ‌న ఫ్యామిలీ మ్యాన్ ర‌న్నింగ్ సిరీస్ లోనా? ఇది నిజంగా ఉత్కంఠను ప‌దింత‌ల పెంచే అంశం. హ‌నీ, బ‌న్నీ పేర్లను పరిశీలించి 90ల కాలానికి చెందిన ప్ర‌మాద‌క‌ర స్పై ఏజెంట్లు అని తివారీ చెబుతాడు. JK - శ్రీకాంత్ చివరికి హనీ & బన్నీ గూఢచారులు అని తెలుసుకుంటారు. హనీ - బన్నీ ఇక్కడ ఉన్నారు! అని ఒక పేజర్ బీప్ చేయడంతో ఆ ఇద్ద‌రూ షాక్ కి గుర‌వుతారు. వారి పేర్ల‌ను త‌లుచుకునే క్ర‌మంలోనే వారు అక్క‌డికి చేరుకోవ‌డ‌మా? ఇది నిజంగా ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. త్వ‌ర‌లో ట్రైల‌ర్ ని లాంచ్ చేస్తామ‌ని కూడా వెల్ల‌డించారు.

మునుముందు వెబ్ షో కొత్త పుంత‌లు తొక్కుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఫ్యామిలీమ్యాన్ - హ‌నీ బ‌న్నీ క్రాస్ఓవర్ జరుగుతుందని వీక్ష‌కుల‌కు అర్థమైంది. ప్ర‌స్తుతం ఇది ఫ్యామిలీమ్యాన్ ఫ్యాన్స్ ని నిల‌వ‌నీయ‌డం లేదు. అయితే నిర్మాతల వైపు నుండి క్లారిటీ రావాల్సి ఉంది. రాజ్ అండ్ డీకే దీనిపై ఏదైనా హింట్ ఇస్తారేమో చూడాలి.