Begin typing your search above and press return to search.

లెజెండ‌రీ న‌టుడు అస‌భ్య‌త‌కు కార‌కుడా?

న‌టీమ‌ణుల అర్థ న‌గ్న నృత్యాలు చేస్తుంటే ఆ స్టార్ ఎలా ఆస్వాధిస్తున్నారో చూపించే ఫోటోలు షాక్ కి గురి చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   13 Dec 2024 10:30 PM GMT
లెజెండ‌రీ న‌టుడు అస‌భ్య‌త‌కు కార‌కుడా?
X

భార‌త‌దేశంలో ఎంద‌రో స్టార్ల‌కు, న‌టుల‌కు ఆయ‌న ఒక స్ఫూర్తి. భార‌తీయ చ‌ల‌న‌ చిత్ర‌సీమ‌లో లెజెండ‌రీ న‌టుడిగా గౌర‌వం అందుకున్నారు. ఎన్నో అవార్డులు రివార్డులు, దేశ‌వ్యాప్తంగా గొప్ప ఫాలోయింగ్ ఉన్న స్టార్ ఆయ‌న‌. కానీ ఆయ‌న నెటిజ‌నుల నుంచి తీవ్ర‌మైన విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంటున్నారు. స్త్రీల‌ను సెమీ న్యూడ్ గా చూపించే అత‌డి సినిమాల నుంచి కొన్ని ఫోటోల‌ను కూడా వెబ్ లో వైర‌ల్ చేస్తున్నారు. పాత కాలంలో బాలీవుడ్ లో జ‌రిగిన పార్టీల నుంచి కొన్ని ఫోటోల‌ను వారు షేర్ చేసారు. న‌టీమ‌ణుల అర్థ న‌గ్న నృత్యాలు చేస్తుంటే ఆ స్టార్ ఎలా ఆస్వాధిస్తున్నారో చూపించే ఫోటోలు షాక్ కి గురి చేస్తున్నాయి.

అయితే స‌ద‌రు న‌టుడి శ‌త‌దినోత్స‌వ వేడుక‌ల‌ వేళ ఇలాంటి విమ‌ర్శ‌లు ఊహించ‌నివి. ఇలాంటి ఏహ్య భావం క‌లిగించే కామెంట్లు త‌గ‌నివ‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. పాపుల‌ర్ వెట‌ర‌న్ న‌టుడు రాజ్ కపూర్ భారతీయ సినిమా చరిత్రలో ప్రముఖు స్టార్ గా .. క్లాసిక్ డే సినిమాకి దిక్సూచిగా ఉన్నారు. భార‌తీయ‌ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న సమయంలో అత‌డు హిందీ సినిమాను ప్రపంచ స్థాయికి చేర్చారు. విదేశీ ప్రేక్షకుల నుండి ప్ర‌శంస‌ల్ని అందుకున్న న‌టుడు అత‌డు. అంతేకాదు భార‌త‌దేశంలో ఎంద‌రో స్టార్లు ఆయ‌న స్ఫూర్తితో త‌మ సినిమాల్లో న‌ట‌న‌ను అనుక‌రించిన సంద‌ర్భాలున్నాయి. ప‌లువురు టాలీవుడ్ వెట‌రన్ స్టార్లు రాజ్ క‌పూర్ ని స్ఫూర్తిగా తీసుకుని త‌మ సినిమాల్లో న‌టించారంటే అతిశ‌యోక్తి కాదు.

కానీ ఇప్పుడు దివంగ‌త స్టార్ రాజ్ క‌పూర్ అందుకు భిన్న‌మైన విమ‌ర్శ‌ల్ని ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. అత‌డి ద‌ర్శ‌కులు త‌న సినిమాల్లో ప్రజ‌ల్ని ఆక‌ర్షించేందుకు స్త్రీలను అస‌భ్యంగా చూపించార‌ని, ఐట‌మ్ నంబ‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించార‌ని కూడా విమ‌ర్శించారు.

నిజానికి సినిమా అనేది వ్యాపార సంబంధిత‌మైన‌ది. ప్ర‌జ‌ల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించేందుకు చాలా జిమ్మిక్కులు చేయాల్సి ఉంటుంది. నాటి రోజుల్లో ద‌ర్శ‌కులు క‌మ‌ర్షియ‌ల్ సినిమా మేకింగ్ కోసం క‌థానాయిక‌లను గ్లామ‌ర‌స్ గా చూపించారు. ఐట‌మ్ గాళ్స్ తో ఐట‌మ్ నంబ‌ర్ల‌ను ర‌స‌ర‌మ్యంగా తెర‌కెక్కించారు. దానికి హీరోని మాత్ర‌మే బాధ్యుడ‌ను చేస్తూ కామెంట్లు చేయ‌డం స‌రికాద‌ని విశ్లేషిస్తున్నారు. రాజ్ కపూర్ త‌న కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించారు. మేరా నామ్ జోకర్, సత్యం శివం సుందరం, సంగం ప్రేమ్ రోగ్ వంటి చిత్రాలతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా చెర‌గ‌ని ముద్ర వేసారు. రాజ్ క‌పూర్ సినిమాల నుంచి చెడును మాత్ర‌మే హైలైట్ చేస్తూ భార‌తీయ సినీరంగానికి ఆయ‌న సినిమాలు చేసిన మేలును మ‌ర్చిపోవ‌డం త‌గ‌ద‌ని సూచిస్తున్నారు. అలాగే క‌పూర్ కుటుంబం గౌర‌వార్థ‌కంగా మాత్ర‌మే ప్ర‌ధాని మోదీని రాజ్ క‌పూర్ శ‌త‌దినోత్స‌వ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించ‌డాన్ని త‌ప్పు ప‌ట్టే వ‌ర్గం గుర్తించాల్సిన గొప్ప సంగ‌తులు లెజెండ‌రీ న‌టుడి విష‌యంలో చాలా ఉన్నాయి.