Begin typing your search above and press return to search.

ఈసారి ఆయ‌న నేరుగా ఇంటికొచ్చి బెదిరిస్తాడు!

ఆ సినిమాకు సీక్వెల్స్ ఎప్పుడొస్తాయా? అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓ ఈవెంట్ లో రాజ్ కుమార్ హిరాణీ సీక్వెల్స్ గుట్టు విప్పేసారు.

By:  Tupaki Desk   |   19 Oct 2024 8:30 AM GMT
ఈసారి ఆయ‌న నేరుగా ఇంటికొచ్చి బెదిరిస్తాడు!
X

బాలీవుడ్ డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ నుంచి రిలీజ్ అయిన 'మున్నాభాయ్' ప్రాంచైజీ స‌క్సెస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. 'మున్నాభాయ్ ఎంబీబీఎస్', 'ల‌గో ర‌హా మున్నాభాయ్' చిత్రాలు భారీ విజ‌యాలు సాధించాయి. దీంతో మున్నాభాయ్ అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్ ప్రాంచైజీ గా మారింది. ఆ సినిమాకు సీక్వెల్స్ ఎప్పుడొస్తాయా? అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓ ఈవెంట్ లో రాజ్ కుమార్ హిరాణీ సీక్వెల్స్ గుట్టు విప్పేసారు.

అభిమానులు ఆస‌క్తికి తెర దించుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. 'మున్నా భాయ్ 3 కోసం నా వద్ద ఐదు సగం పూర్తయిన స్క్రిప్ట్‌లు ఉన్నాయి. ఒక స్క్రిప్ట్‌పై ఆరు నెలలు గడిపాను. ఇది ఇంటర్వెల్‌కి చేరుకుంది. కానీ ఆ త‌ర్వాత ముందుకు వెళ్ల‌లేదు. అక్క‌డితో అది అలా ఆగింది. ఇంకా 'మున్నా భాయ్ LLB', 'మున్నా భాయ్ చల్ బేస్', 'మున్నా భాయ్ చలే అమ్రీకా' ఇలా మొత్తంగా ఆరు క‌థ‌లు రెడీ అవుతున్నాయి. కానీ ఇవ‌న్నీ కొద్ది భాగం మాత్ర‌మే పూర్త య్యాయి.

ఇంకా వాటి పూర్తి క‌థ సిద్దం కాలేదు. మొద‌టి రెండు భాగాల‌ను మించి మూడ‌వ భాగం మ‌రింత మెరుగ్గా తీయాలి. ఇది నా పై ఉన్న అతి పెద్ద బాధ్య‌త‌. అందుకే స‌మ‌యం తీసుకుంటున్నాను. ఈ నేప‌థ్యంలోనే నాకో ప్రత్యేకమైన ఆలోచన ఉంది. 100 సంవ‌త్స‌రాల సినిమా చ‌రిత్ర‌లో ప్ర‌తీది ఎంతో గొప్ప‌గా చెప్ప‌బ‌డింది. అదే ఆలోచ‌న‌తో నా త‌దుప‌రి సినిమాల విష‌యంలో ప‌ని చేస్తున్నాను. సంజ‌య్ ద‌త్ వ‌చ్చి మ‌ళ్లీ త‌ర్వాత సినిమా సంగ‌తేంటి? అని ఆయ‌న నేరుగా ఇంటికొచ్చి బెదిరించవ‌చ్చు.

అత‌డు నిజంగా మ‌రో మున్నాభ‌య్ సినిమా చేయాల నుకుంటున్నాడు. కానీ నా కార‌ణంగానే డిలే అవుతుంది' అని అన్నారు. అంటే మున్నాభాయ్ -3 ఇంకా రెడీగా కాలేదు అన్న మాట‌. అన్ని సంగం క‌థ‌ల‌తో ఉన్నాయి. త‌ప్ప వాటిని పూర్తి చేయ‌లేదు. మ‌రి అందుకు రాజ్ కుమార్ ఇంకెంత స‌మ‌యం తీసుకుంటారో చూడాలి.