Begin typing your search above and press return to search.

వెండితెర గంగూలీ దొరికేశాడు..!

గంగూలీ జీవిత చరిత్రతో సినిమా రూపొందించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ఆ ప్రయత్నాలు కార్యరూపం దాల్చబోతున్నాయి.

By:  Tupaki Desk   |   24 Jan 2025 5:30 PM GMT
వెండితెర గంగూలీ దొరికేశాడు..!
X

ఇండియన్‌ స్క్రీన్‌ మీద ఇప్పటి వరకు ఎన్నో బయోపిక్స్ వచ్చాయి. అందులో కొందరి క్రికెటర్స్ బయోపిక్స్ కూడా ఉన్నాయి. ధోనీ, సచిన్‌, కపిల్‌తో పాటు ఎంతో మంది క్రికెటర్స్ బయోపిక్స్‌ను ప్రేక్షకుల ముందు ఆవిష్కరించారు. అయితే టీం ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ జీవిత చరిత్రకు మాత్రం మోక్షం దక్కడం లేదు. ఎప్పుడు ఆ బయోపిక్ వస్తుందా అని చాలా మంది ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. గంగూలీ కంటే జూనియర్‌లు అయిన చాలా మంది బయోపిక్ సినిమాలు వచ్చాయి కానీ ఎందుకు గంగూలీ సినిమా బయోపిక్ రావడం లేదు అనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న. కొన్ని డాక్యుమెంటరీలు గంగూలీపై వచ్చినా పూర్తి స్థాయి సినిమా మాత్రం రాలేదు.

గంగూలీ జీవిత చరిత్రతో సినిమా రూపొందించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ఆ ప్రయత్నాలు కార్యరూపం దాల్చబోతున్నాయి. సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గంగూలీ సినిమాలో గంగూలీగా బాలీవుడ్ విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్న రాజ్‌ కుమార్‌ రావును ఎంపిక చేయడం జరిగింది. మొన్నటి వరకు ఆయుష్మాన్‌ ఖురానా పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ ఆయన కాకుండా గంగూలీ పాత్రకు రాజ్ కుమార్‌ రావు అయితేనే ప్రాణం పోసినట్లుగా నటిస్తాడని అంతా భావించారు. అందుకే ఆయన్ను కన్ఫర్మ్‌ చేశారని తెలుస్తోంది.

టీం ఇండియా గొప్ప క్రికెటర్స్‌లో గంగూలీ ఒకరు అనడంలో సందేహం లేదు. ఆయన సారధ్యంలో ఎన్నో అద్భుతమైన విజయాలను టీం ఇండియా సొంతం చేసుకుంది. విదేశీ గడ్డపై గంగూలీ సక్సెస్ రేటు చాలా ఎక్కువ. ఆయన క్రికెటర్‌గానే కాకుండా ఎన్నో రకాలుగా ఇండియన్ క్రికెట్‌కి సేవలు అందించారు. అందుకే ఆయన జీవిత చరిత్ర కచ్చితంగా క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తుంది. కొత్తగా క్రికెట్‌లో అడుగు పెట్టబోతున్న వారికి ఆదర్శంగా ఉండే విధంగా గంగూలీ బయోపిక్ ఉండాలి అని క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

గంగూలీ కెప్టెన్సీలో 146 వన్డేలను ఆడిన టీం ఇండియా అందులో 50% కంటే ఎక్కువ విజయాలను సొంతం చేసుకుంది. ఇక 41 టెస్టులను గంగూలీ సారధ్యంలో ఆడితే 21 విజయాలను సొంతం చేసుకుంది. క్రికెట్‌కి సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్న గంగూలీకి గౌరవంగా బీసీసీఐ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. సుదీర్ఘ కాలం పాటు గంగూలీ ఆ పదవిలో ఉన్నారు. ఇండియన్ క్రికెట్‌ల సచిన్‌, ధోనీ తర్వాత అత్యంత ఎక్కువ గుర్తింపును దక్కించుకున్న క్రికెటర్‌ గంగూలీ అనడంలో సందేహం లేదు. ఆయన బయోపిక్ ను లవ్ రంజన్‌, అంకుర్‌ గార్గ్‌ లు నిర్మిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెళ్లడించే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా వెయిట్‌ చేస్తున్న ఈ బయోపిక్‌ ఈ ఏడాదిలో పట్టాలెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.