Begin typing your search above and press return to search.

బంగ్లాదేశ్ న‌టితోను.. క‌ల‌వ‌ర‌ప‌డ్డాన‌న్న రాజ్ కుంద్రా!

సాగ‌ర‌క‌న్య శిల్పాశెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా నీలి చిత్రాల యాప్ ల కేసులో అరెస్ట‌యి, అనంత‌రం బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   29 Sep 2024 3:45 AM GMT
బంగ్లాదేశ్ న‌టితోను.. క‌ల‌వ‌ర‌ప‌డ్డాన‌న్న రాజ్ కుంద్రా!
X

సాగ‌ర‌క‌న్య శిల్పాశెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా నీలి చిత్రాల యాప్ ల కేసులో అరెస్ట‌యి, అనంత‌రం బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ప్ర‌స్తుతం విచార‌ణ కొన‌సాగుతూనే ఉంది. తాజాగా ఇదే వ‌రుస‌లో మ‌రో కేసులో రాజ్ కుంద్రా పేరు ప్రస్థావ‌న‌కు వ‌చ్చింది.

నకిలీ పత్రాలను ఉపయోగించి భారతదేశంలో అక్రమంగా ఉంటున్నారనే ఆరోపణలపై బంగ్లాదేశ్‌కు చెందిన వయోజన సినీ నటి(శృంగార న‌టి) ఐయా అరవింద బర్డేను మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో గురువారం అరెస్టు చేసినట్లు మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. రాజ్ కుంద్రా ప్రొడక్షన్స్ నిర్మించిన ప‌లు ప్రాజెక్ట్‌లలో స‌ద‌రు బంగ్లాదేశీ న‌టి పని చేసినట్లు వార్త‌లు వెలువ‌డ్డాయి.

అయితే ఇవ‌న్నీ త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ను అని ఖండించారు రాజ్ కుంద్రా. హెచ్‌టి సిటీ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న‌ మాట్లాడుతూ...ఈ వార్తలతో తీవ్రంగా కలవరపడ్డాను! అని అన్నారు. ఇటీవలి వార్తా కథనాలు నాపై తప్పుడు ఆరోపణలను ప్రసారం చేయడంతో నేను తీవ్రంగా కలత చెందాను. ఒక అక్రమ వలసదారునితో సంబంధాలు క‌లిగి ఉన్నాన‌ని ఆరోపించారు. నా నిర్మాణ సంస్థల గురించి నాకు చాలా స్పష్టంగా తెలుసు. నేను ఈ వ్యక్తిని ఎప్పుడూ కలవలేదు..ఈ వ్యక్తి పనిచేసిన ఏ నిర్మాణ సంస్థతోనూ నాకు ఎలాంటి సంబంధాల్లేవు`` అని వివ‌ర‌ణ ఇచ్చారు. తన ప్రతిష్టకు హాని కలిగించే క్లెయిమ్‌లన్నీ నిరాధారం అని అన్నారు. ఈ వాదనలు నా ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా నా పేరును సంచలనం చేసి, మీడియా ట్రాక్షన్ కోసం ఉపయోగించుకునే ప్రయత్నం. అలాంటి తప్పుడు ఆరోపణలను నేను సహించను అని రాజ్ విరుచుకుప‌డ్డారు.

దీనిపై అత‌డు చట్టపరమైన చర్యలకు యోచిస్తున్నాడ‌ని స‌మాచారం. అతడి తరపు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ మాట్లాడుతూ.. ముంబయి పోలీసులు అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు సామాజిక, డిజిటల్, ప్రింట్ మీడియాలో కొన్ని క‌థ‌నాలొచ్చాయి. నకిలీ వార్త‌లు రాయిస్తూ నా క్లయింట్లు శిల్పాశెట్టి కుంద్రా - రాజ్‌ల ప్రొడక్షన్ టీమ్‌తో లింక‌ప్ చేస్తున్నారు. ఇది తప్పుదారి పట్టించే వ్య‌వ‌హారం. నా క్లయింట్‌లను అప్రతిష్టపాలు చేయడానికి ఉద్దేశపూర్వకంగా జరిగింది. సోషల్ మీడియాలో ఇలాంటి అభ్యంతరకర కంటెంట్‌ని సృష్టించడం వల్ల నా క్లయింట్లు వెంటనే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనల ప్రకారం సైబర్ క్రైమ్ ముంబై పోలీసులతో క్రిమినల్ కేసును నమోదు చేస్తున్నారు`` అని వెల్ల‌డించారు.

నా క్లయింట్‌లను పరువు తీయాలనే ఉద్దేశ్యంతో నకిలీ కథనాన్ని సృష్టించిన నేరస్థులపై క్రిమినల్ చట్టంలోని కఠినమైన నిబంధనల ప్రకారం కేసు నమోదు చేస్తున్నాము. నా ఖాతాదారులకు సంబంధించి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న అటువంటి నేరస్థులను వెంటనే అరెస్టు చేయాలని మేము అభ్యర్థిస్తాము అని లాయ‌ర్ అన్నారు.