రాజ్ తరుణ్ తో హీరోయిన్.. మరో గొడవతో లావణ్య వీడియో లీక్
కానీ ముంబైలో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా ఒకే ప్లాట్ లో ఉన్న సమయంలో లావణ్య అక్కడికి వెళ్లి రచ్చ చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది.
By: Tupaki Desk | 7 Sep 2024 4:52 AM GMTరాజ్ తరుణ్, లావణ్య వివాదంలో మరల కొత్త మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. లావణ్య ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి ప్రూవ్స్ సేకరించారు. వారిద్దరూ కలిసి ఉన్నారు అనడానికి సాక్ష్యాలు ఉన్నాయని పోలీసులు నిర్ధారణకి వచ్చారని టాక్. ఈ కేసులో రాజ్ తరుణ్ ని ప్రధాన నిందితుడిగా చేరుస్తూ చార్జ్ షీట్ ఫైల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అతనిని అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధం అవుతున్నారని టాక్. రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం సద్దుమణిగింది అని అందరూ అనుకున్నారు.
ఇలాంటి సమయంలో మరల మీడియాలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్ ని నిందితుడిగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ నమోదు చేశారనే విషయం బయటకొచ్చాక సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఉన్నారు. నిజానికి మాల్వీ మల్హోత్రా తో తాను ఎలాంటి రిలేషన్ షిప్ లో లేనని గతంలో రాజ్ తరుణ్ మీడియాలో చెప్పుకొచ్చారు. అయితే లావణ్య ముంబై వెళ్లి వారిద్దరూ ఉన్న ప్లాట్ లో గొడవ చేసింది.
ఆ వీడియోలో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా క్యాజువల్ డ్రెస్ లలో కనిపించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వారిద్దరూ ఉంటున్న ప్లాట్ కి వెళ్లిన లావణ్య మాల్వీ మల్హోత్రాతో గొడవ పడింది. 11 ఏళ్ళు రాజ్ తరుణ్ తో రిలేషన్ లో ఉన్నాను. ఇప్పుడు నా నుంచి రాజ్ తరుణ్ ని దూరం చేసి నీ దగ్గరకి ఎలా తెచ్చుకుంటావ్ అంటూ లావణ్య వీడియోలో గొడవ చేసింది. అతన్ని తిరిగి పంపించాలంటూ మాల్వీ మల్హోత్రాపై లావణ్య దూషణలకి దిగింది.
లావణ్య ఇంట్లో గొడవ చేస్తున్న సమయంలో మాల్వీ మల్హోత్రా ఆమెని అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. మాల్వీ మల్హోత్రా, రాజ్ తరుణ్ ముంబైలో లివింగ్ రిలేషన్ లో ఉన్నారని లావణ్య మొదటి నుంచి చెబుతూ వస్తోంది. అయితే అది ఎంత వరకు వాస్తవం అనేది తెలియదు. కానీ ముంబైలో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా ఒకే ప్లాట్ లో ఉన్న సమయంలో లావణ్య అక్కడికి వెళ్లి రచ్చ చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాపై ముంబై పోలీసులకి కూడా లావణ్య ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
మాల్వీ మల్హోత్రా కూడా లావణ్యపై ఫిర్యాదు చేయడానికి సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది. ఈ వీడియోలో రాజ్ తరుణ్ కూడా లావణ్యని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నా ఫోన్ ఎందుకు లాక్కుంటావ్ అంటూ లావణ్యని రాజ్ తరుణ్ వీడియోలో ప్రశ్నిస్తున్నాడు. ఈ వీడియోని లావణ్యని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. లావణ్య కేసులో పోలీసులు చార్జ్ షీట్ ఫైల్ చేయడంతో అతనిని త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. మరి ఈ విషయంలో రాజ్ తరుణ్ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందో చూడాలి.