Begin typing your search above and press return to search.

డబ్బుల్లేక 11 రోజులు అలాగే.. రాజ్ తరుణ్ కష్టాలు!

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్.. ఉయ్యాల జంపాల మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Sep 2024 1:30 PM GMT
డబ్బుల్లేక 11 రోజులు అలాగే.. రాజ్ తరుణ్ కష్టాలు!
X

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్.. ఉయ్యాల జంపాల మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. డెబ్యూ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆయన.. బెస్ట్ యాక్టర్ గా అవార్డు గెలుచుకున్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకున్నారు. సినిమా చూపిస్తా మావా, కుమారి 21 ఎఫ్ వంటి పలు సినిమాలతో మంచి సక్సెస్ లు దక్కించుకున్నారు. ఇప్పుడు సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు.

కొద్దిరోజులుగా వరుస సినిమాలు చేస్తున్నా.. అనుకున్నంత స్థాయిలో హిట్స్ అందుకోలేకపోతున్నారు. కొన్ని మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంటే.. మరికొన్ని మాత్రం నిరాశ పరుస్తున్నాయి. గత 45 రోజుల వ్యవధిలో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రాజ్ తరుణ్. పురుషోత్తముడు, తిరగబడరాతో ఇటీవల సందడి చేయగా.. నిన్న భలే ఉన్నాడే మూవీతో థియేటర్లలోకి వచ్చారు. తన యాక్టింగ్ తో ఆడియన్స్ ను మెప్పించారు.

అయితే భలే ఉన్నాడే మూవీ ప్రమోషన్స్ లో తన కెరీర్ తొలి రోజులను గుర్తు చేసుకున్నారు. తాను పడ్డ కష్టాలను షేర్ చేసుకున్నారు. అసిస్టెంట్‌ డైరెక్టర్ గా తాను ఇండస్ట్రీలోకి వచ్చినట్లు తెలిపారు. ఇండస్ట్రీలోకి వచ్చేందుకు చాలా కష్టపడ్డానని చెప్పారు. విశాఖపట్నం తప్ప మరో ఊరు కూడా తనకు తెలియదని అన్నారు. రూ.3వేల జీతానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా 52 షార్ట్ ఫిల్మ్ లు తీసిన రామ్మోహన్ గారి వద్ద పనికి చేరానని వెల్లడించారు.

స్క్రిప్ట్‌ రాసిన తర్వాత తనతో సీన్‌ గురించి చర్చించేవారని, ఇంకా బాగా రాస్తే బాగుండేదని అనేవాడినని తెలిపారు. దీంతో తన వల్ల స్క్రిప్ట్ వర్క్ ముందుకు వెళ్లదని తనను పంపించేశారని తెలిపారు. అప్పుడేం చేయాలో అస్సలు అర్థం కాలేదని వెల్లడించారు. సినిమాల్లోకి వెళ్లాలని చదువు వదిలేశానని చెప్పారు. కనీసం ఉంటున్న రూమ్ కు అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేవని పేర్కొన్నారు. చేసేదేం లేక.. ఫుట్ పాత్ పైనే నిద్రపోయానని చెప్పారు. అలా 11 రోజుల పాటు అక్కడే ఉన్నానని తన కష్టాలను గుర్తు చేసుకున్నారు రాజ్ తరుణ్.

ఆ తర్వాత ఒక్కరోజు తనను మళ్లీ రామ్మోహన్ గారు పిలిచారని రాజ్ తరుణ్ తెలిపారు. అప్పటికి తన వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమేనని చెప్పారు. ఏదేమైనా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యానని పేర్కొన్నారు. రెండోసారి రామ్మోహన్ గారు పిలిచాక పట్టుదలతో రైటర్ గా వర్క్ చేశానని తెలిపారు. ఆ తర్వాత హీరోగా ఛాన్స్ అందుకున్నానని, ఉయ్యాల జంపాలా సినిమా చేశానని చెప్పారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.