Begin typing your search above and press return to search.

యంగ్ హీరో ఊరమాస్ లుక్.. ఎవరూ ఊహించి ఉండరు!

ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా ఎందరో యాక్టర్స్.. తమ సినిమాల కోసం మేకోవర్ చేసుకుంటారన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   11 Oct 2024 4:03 PM GMT
యంగ్ హీరో ఊరమాస్ లుక్.. ఎవరూ ఊహించి ఉండరు!
X

ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా ఎందరో యాక్టర్స్.. తమ సినిమాల కోసం మేకోవర్ చేసుకుంటారన్న విషయం తెలిసిందే. కేవలం సినిమా కోసమే జుట్టు, గడ్డాన్ని బాగా పెంచుకుంటున్నారు. హెవీ వర్కౌట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీ సంపాదించుకుంటున్నారు. వేరే లెవెల్ బాడీని మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది హీరోలు.. అలా చేశారు.. చేస్తున్నారు కూడా. ఇప్పుడు అదే కోవలోకి మరో టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ చేరారు.

షార్ట్స్ ఫిల్మ్స్ తో కెరీర్ ను స్టార్ట్ చేసిన రాజ్ తరుణ్.. ఆ తర్వాత హీరోగా మారారు. డెబ్యూ మూవీ ఉయ్యాలా జంపాలాతో మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత నుంచి యూత్, రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ స్టోరీస్ ఎంచుకుంటూ అలరిస్తున్నారు. రిజల్ట్ తో సంబంధం లేకుండా వచ్చిన ఛాన్స్ లు అందుకుంటున్నారు. వరుస సినిమాల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా పురుషోత్తముడు, తిరగబడరా సామీ, భలే ఉన్నాడో చిత్రాలతో సందడి చేశారు.

ఇప్పుడు పాన్ ఇండియా మూవీ రామ్ భజరంగ్ చేస్తున్నారు. అందుకోసం ఎవ్వరూ ఊహించని రీతిలో మేకోవర్ చేసుకున్నారు. రా అండ్ రస్టిక్ లుక్ లోకి మారిపోయారు. ఊర మాస్ గా ఛేంజ్ అయ్యారు. సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా మల్టీస్టారర్ గా తెరకెక్కుతోంది. రాజ్‌ త‌రుణ్‌ తో పాటు జార్జిరెడ్డి ఫేమ్ సందీప్ మాధ‌వ్ మ‌రో హీరోగా న‌టిస్తున్నారు. మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో ఇద్దరూ ఊర‌మాస్ లుక్‌ లో క‌నిపిస్తున్నారు.

నోట్లో బీడీ, లుంగీ, పూల చొక్కా ధ‌రించిన రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ లుక్స్ డిఫ‌రెంట్‌ గా ఉన్నాయి. లాంగ్ హెయిర్ తో రాజ్‌ త‌రుణ్ లుక్ ఫుల్ గా ఇంట్రెస్ట్ పెంచుతోంది. ఇప్పటి వరకు ఎక్కువ‌గా ల‌వ‌ర్‌ బాయ్‌ రోల్స్ చేసిన రాజ్‌ త‌రుణ్.. రామ్ భ‌జ‌రంగ్ మూవీలో ఫ‌స్ట్ టైమ్ మాస్ రోల్ చేయనున్నారు. గ‌ద‌ర్ 2 బ్యూటీ సిమ్ర‌త్ కౌర్, బిచ్చ‌గాడు ఫేమ్ సాట్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

1980 బ్యాక్‌ డ్రాప్‌ లో యాక్ష‌న్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న రామ్ భజరంగ్ కు మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. స‌త్యం రాజేష్‌, ష‌ఫీ, రవిశంకర్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. పాన్ ఇండియా లెవెల్‌ లో తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం హిందీ భాష‌ల్లో సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు మేకర్స్. 2025 స్టార్టింగ్ లో థియేటర్లలోకి తీసుకురానున్నారు. మరి రామ్ భజరంగ్ మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.