Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : 'రాజాసాబ్‌' బ్యూటీ మిర్రర్‌ షో

అయినా మాళవిక అందాల ఆరబోత గురించి సోషల్‌ మీడియా ద్వారా తెలిసిన వారు రాజాసాబ్‌ లో ఈమెను వెంటనే చూడాలని ఆశ పడుతున్నారు.

By:  Tupaki Desk   |   24 Oct 2024 8:30 PM GMT
పిక్‌టాక్ : రాజాసాబ్‌ బ్యూటీ మిర్రర్‌ షో
X

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌. గతంలో ఈమె చేసిన తమిళ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఇప్పుడు పూర్తి స్థాయి తెలుగు సినిమాతో టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ అమ్మడి పై ఉంది. మాళవిక మోహనన్‌ తో పాటు నిధి అగర్వాల్‌ సైతం రాజాసాబ్‌ లో ఉందనే విషయం తెల్సిందే. అయినా మాళవిక అందాల ఆరబోత గురించి సోషల్‌ మీడియా ద్వారా తెలిసిన వారు రాజాసాబ్‌ లో ఈమెను వెంటనే చూడాలని ఆశ పడుతున్నారు.

మాళవిక మోహనన్‌ ఇప్పటి వరకు తాను రాజాసాబ్‌ సినిమాలో నటిస్తున్నట్లుగా అధికారికంగా రివీల్‌ చేయలేదు. ఆ మధ్య ఒక స్టార్‌ హీరో సినిమాలో నటిస్తున్నట్లుగా ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆ విషయంపైన అధికారిక ప్రకటన రాలేదు. కానీ యూనిట్‌ సభ్యులు ఇప్పటికే ఈమె నటిస్తున్నట్లుగా రివీల్‌ చేయడం జరిగింది. ప్రభాస్ కు సరి జోడీ ఈ అమ్మడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందమైన రూపం తో పాటు, ఆకట్టుకునే ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అనడంలో సందేహం లేదు. అందుకే సోషల్‌ మీడియాలో ఈమె ఏ ఫోటో షేర్‌ చేసినా లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. తాజాగా మరోసారి ఈమె కన్నుల విందు చేసింది.

ఈసారి మిర్రర్‌ సెల్ఫీ తీసుకుంటూ తన క్లీ వేజ్ అందాన్ని చూపించడం ద్వారా వైరల్‌ అవుతోంది. సాధారణంగానే మాళవిక మోహనన్‌ ఫోటోలు చాలా అందంగా ఉంటాయి. అలాంటిది ఇలా మిర్రర్‌ లో రివర్స్‌ రిఫ్లెక్షన్‌ తో మరింత అందంగా మాళవిక కనిపిస్తోంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ ఫోటోకు తెగ లైక్స్ కామెంట్స్ వస్తున్నాయి. పోస్ట్‌ చేసిన కొన్ని నిమిషాల్లోనే వేలల్లో లైక్స్ రావడం చూస్తూ ఏ స్థాయిలో ఈ ఫోటోను నెటిజన్స్‌ ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి క్లీ వేజ్‌ షో తో మరో సారి ఈ అమ్మడు మతి పోగొట్టింది.

రాజాసాబ్‌ సినిమా తర్వాత మాళవిక మోహనన్‌ ఖచ్చితంగా మరిన్ని తెలుగు సినిమా ఆఫర్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. యంగ్‌ హీరోలు మాత్రమే కాకుండా సీనియర్‌ హీరోలకు సైతం ఈమె సరి జోడీ అని గతంలో నిరూపితం అయ్యింది. అందుకే తప్పకుండా మాళవిక మోహనన్‌ గట్టిగా ప్రయత్నిస్తే టాలీవుడ్‌ లో రాబోయే రెండు మూడు సంవత్సరాల పాటు టాప్ స్టార్‌ హీరోయిన్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయనే అభిప్రనాయం వ్యక్తం అవుతోంది. అతి త్వరలోనే రాజాసాబ్‌ నుంచి ఈమె లుక్ రావాలని అంతా కోరుకుందాం. మరో వైపు ఈమె ఒక హిందీ సినిమాతో పాటు రెండు తమిళ సినిమాలను సైతం చేస్తుందట. త్వరలో అవి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. రాజాసాబ్‌ తో మాళవిక వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.