Begin typing your search above and press return to search.

రాజా సాబ్ ఆడియన్స్ కు రేర్ ఎక్స్ పీరియన్స్..?

థ్రిల్లర్ సినిమా అనగానే భయ పెట్టడం నవ్వించడం ఉంటాయి ఐతే ఈ సినిమాలో ఆ రెండిటితో పాటు ఆడియన్స్ కు ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ కూడా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుందట.

By:  Tupaki Desk   |   13 March 2025 8:15 AM IST
రాజా సాబ్ ఆడియన్స్ కు రేర్ ఎక్స్ పీరియన్స్..?
X

రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న సినిమా రాజా సాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ అంతా ఒక రేంజ్ లో ఉంది. ఐతే స్టార్ సినిమాల్లో థ్రిల్లర్ జోనర్ సినిమాలు చాలా అరుదు. అందులోనూ ప్రభాస్ లాంటి స్టార్ తో ఇలాంటి అటెంప్ట్ నెవర్ బిఫోర్ అని చెప్పొచ్చు.

ఇప్పటివరకు రాజా సాబ్ సినిమా నుంచి కేవలం ప్రభాస్ ఎంట్రీ తో పాటు మోషన్ పోస్టర్ మాత్రమే వచ్చాయి. సినిమా నుంచి టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఐతే రాజా సాబ్ సినిమా నుంచి లేటెస్ట్ గా వస్తున్న టాక్ ఏంటంటే ఇది ఆడియన్స్ కు ఒక రేర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని అంటున్నారు. రెగ్యులర్ థ్రిల్లర్ కథలు, సినిమాలకు భిన్నంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది.

థ్రిల్లర్ సినిమా అనగానే భయ పెట్టడం నవ్వించడం ఉంటాయి ఐతే ఈ సినిమాలో ఆ రెండిటితో పాటు ఆడియన్స్ కు ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ కూడా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుందట. పాన్ ఇండియాలో భారీ క్రేజ్ ఉన్న ప్రభాస్ ఇలాంటి కథను ఎంపిక చేసుకోవడమే పెద్ద సాహసం అనిపించేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. సినిమాను అసలైతే ఈ సమ్మర్ కి తీసుకు రావాలని అనుకున్నారు కానీ కుదరలేదు.

ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ కన్ ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయని మేకర్స్ ఊరిస్తున్నారు తప్ప సినిమా నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయట్లేదు. ఈ విషయంలో ఫ్యాన్స్ డిజప్పాయింటెడ్ గా ఉన్నారు. రాజా సాబ్ సెప్టెంబర్ రిలీజ్ అని కొందరు అంటుంటే దసరా బరిలో దిగుతుందని కొందరు చెబుతున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి. రాజా సాబ్ తో పాటుగా ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ (వర్కింగ్ టైటిల్) ని కూడా షూటింగ్ చేస్తున్నాడు. రాజా సాబ్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుందని తెలుస్తుండగా ఫౌజీని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.