రజనీ కంట కన్నీరు చూడగలమా?
అతడి పనితనాన్ని..ఎదిగిన వైనాన్ని..రాజకీయంగా అతను ఎదుగుదలను కాంక్షిస్తూ రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
By: Tupaki Desk | 27 Jan 2024 9:28 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి తెలిసిందే. హీరో విజయ్ అభిమానులు సూపర్ స్టార్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇష్టాను సారం కామెంట్లు చేసారు.` జైలర్` ఈవెంట్ లో రజనీ కాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు విజయ్ అభిమానుల్లోకి చెడుగా వెళ్లడంతోనే ఈ రకమైన విమర్శలు ఎదుర్కో వాల్సి వచ్చింది. ఇప్పటికే రజనీకాంత్ వీటిపై వివరణ కూడా ఇచ్చారు. హీరో విజయ్ తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు.
అతడి పనితనాన్ని..ఎదిగిన వైనాన్ని..రాజకీయంగా అతను ఎదుగుదలను కాంక్షిస్తూ రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అయితే తండ్రిపై జరిగిన ట్రోలింగ్ గురించి తొలిసారి ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ స్పందించారు. `సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాను. కానీ ఆన్ లైన్ నెగిటివిటీ గురించి నా టీమ్ చెబుతుంటుంది. వాటి వల్ల నేను సీరియస్ అయిన సందర్భాలున్నాయి. మేము మనుషుల మే..మాకు బావోద్వేగాలుంటాయి.
ఈ మధ్య కాలంలో నా తండ్రిని సంఘీ అంటున్నారు. దాని అర్దం ఏంటో ముందునాకు తెలియదు. తర్వాత అడిగి తెలుసుకున్నాను. రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చేవారిని అలా పిలుస్తారని అంటారుట. రజనీకాంత్ సంఘీ కాదు. అలా అయితే ఆయన లాల్ సలామ్ సినిమాలో నటించేవారు కాదు` అన్నారు. కుమార్తె మాటలు విన్న రజనీకాంత్ ఎంతో ఎమోషన్ కి గురయ్యారు. ఆయన కంట కన్నీళ్లు వచ్చాయి.ఇంతవరకూ ఇలాంటి సన్నివేశం రజనీకాంత్ కెరీర్ లో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. కెరీర లో ఎన్నో ఆటు పోటులు ఎదుర్కున్నారు.
సాధారణ కండెక్టర్ జీవితం నుంచి సూపర్ స్టార్ గా ఎదిగే వరకూ ఎన్నో అవమానాలు..అమర్యాదలు చూసారు. ఆర్దిక సంక్షోభాన్ని సైతం చూసారు. ఆయన సినిమాలు ప్లాపైన వేళ పంపిణీ దారులు రోడ్డెక్కి రచ్చ చేయడం...అవమానించడం ఇలా ఎన్నో చూసారు. కానీ ఏ నాడు కృంగిపో లేదు. కన్నీళ్లు పెట్టింది లేదు. తొలిసారి కుమార్తె మాటల్ని ఆయన్ని ఎంతో ఎమోషన్ కి గురిచేసాయి. అంటే సోషల్ మీడియా లో ట్రోలింగ్ అనేది నటుల్ని ఎంతగా ఇబ్బంది పెడుతుందో? ఈ సన్నివేశం చెప్పకనే చెబుతుంది.