బాలీవుడ్ కింగ్ ఖాన్ వారసుడితో SS రాజమౌళి
వారసుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నట్లు కింగ్ ఖాన్ షారూఖ్ ఇటీవల గర్వంగా ప్రకటించాడు.
By: Tupaki Desk | 7 Feb 2025 3:30 AM GMTవారసుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నట్లు కింగ్ ఖాన్ షారూఖ్ ఇటీవల గర్వంగా ప్రకటించాడు. ఆర్యన్ ఒక నటుడిగా కాకుండా దర్శకుడిగా పరిచయం అవుతుండడం సర్వత్రా చర్చకు తెరతీసింది. `బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్` వెబ్ సిరీస్ తో అతడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బాబీ డియోల్, లక్ష్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సిరీస్ లో బాలీవుడ్ అగ్ర హీరోలు అతిథి పాత్రల్లో నటిస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సిరీస్‌లో ముగ్గురు ఖాన్‌లు - షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ , అమీర్ ఖాన్ ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారు. రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ , అలియా భట్ కూడా కనిపిస్తారు, కథాంశానికి మెటా ఎలిమెంట్‌ను జోడిస్తారు. ప్రముఖ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, కరణ్ జోహార్ కూడా ఈ షోలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారని కథనాలొచ్చాయి.
సిరీస్ జూన్ 2025 మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. ఇది ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) సీజన్ తర్వాత వచ్చే మొదటి బిగ్గెస్ట్ రిలీజ్. షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్- నెట్ ఫ్లిక్స్ జాయింట్ వెంచర్ సర్వత్రా ఉత్కంఠను పెంచుతుండగా, ఐపీఎల్ తర్వాత జనాల్ని ఓటీటీల వైపు మరల్చే కీలక బాధ్యతను ఆర్యన్ తీసుకున్నారు. అలాగే ఐపిఎల్ మ్యాచ్‌ల అంతటా బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్‌కు ప్రచారం కల్పించాలని ఖాన్ ల బృందం ప్లాన్ చేసింది.
బాలీవుడ్ బా**డ్స్ ట్రైలర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ వేసవి ప్రారంభంలో విడుదల అవుతుంది. ఈ సిరీస్ కి సంబంధించిన ఫోటోలు కొన్ని వీడియోల లీక్ లు ఇప్పటికే ప్రేక్షకులలో వైరల్ అయ్యాయి. ఆర్యన్ ఎంపిక చేసుకున్న కంటెంట్ పై చాలా అంచనాలు ఉన్నాయి. బాబీ డియోల్, లక్ష్యతో పాటు, నటి సహేర్ బాంబా కూడా ఈ షోలో కీలక పాత్ర పోషించింది. భారీ తారాగణం, ఆసక్తికరమైన కథాంశంతో `బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్` 2025లో అత్యంత చర్చనీయాంశమైన వెబ్ సిరీస్‌లలో ఒకటిగా ఉంటుందని భావిస్తున్నారు.