Begin typing your search above and press return to search.

ఆయుధ పూజ వైబ్స్.. జక్కన్న డ్యాన్స్ అదుర్స్..

అయితే లేటెస్ట్ గా రాజమౌళి డ్యాన్స్ చేస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   16 Dec 2024 6:16 AM GMT
ఆయుధ పూజ వైబ్స్.. జక్కన్న డ్యాన్స్ అదుర్స్..
X

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. బ్లాక్ బస్టర్ డైరెక్టరే కాదు మంచి డ్యాన్సర్ అన్న విషయం తెలిసిందే. తన కుమారుడు కార్తికేయ మ్యారేజ్ లో డ్యాన్స్ తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. తన స్టెప్పులతో అలరించారు. దీంతో జక్కన్నలో మంచి డ్యాన్స్ టాలెంట్ ఉందని అప్పుడు అంతా ఫిక్స్ అయిపోయారు.

అయితే లేటెస్ట్ గా రాజమౌళి డ్యాన్స్ చేస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కొడుకు, హీరో శ్రీసింహ పెళ్లిలో జక్కన్న చిందులేసిన వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. శ్రీసింహ వివాహం దుబాయ్ లో జరగ్గా.. సంగీత్ లో తన సతీమణి రమతో జక్కన్న చేసిన డ్యాన్స్ వీడియో అందరినీ ఆకట్టుకుంది.

అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలోని లంచ్ కొస్తావా పాటకు రాజమౌళి, రమ తమ డ్యాన్స్ తో అదరగొట్టారు. ఇప్పుడు సింగర్ కాలభైరవతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీలోని ఆయుధ పూజ సాంగ్ కు జక్కన్న స్టెప్పులు వేస్తున్న వీడియో బయటకొచ్చింది. ఊరమాస్ స్టెప్పులతో రాజమౌళి.. తన డ్యాన్స్ టాలెంట్ ను మరోసారి బయటపెట్టారు.

అయితే ఎన్టీఆర్ వేసిన స్టెప్పులను రాజమౌళి రీక్రియేట్ చేశారు. ఆ విషయంలో బాగానే సక్సెస్ అయ్యారనే చెప్పాలి. తారక్ లా తన షర్ట్ ను నోటితో కరుచుకుని.. స్టెప్పులు వేస్తూ ట్రై చేశారు. కాలభైరవ పర్ఫెక్ట్ గా డ్యాన్స్ చేశారనే చెప్పాలి. ప్రస్తుతం ఆయుధ పూజ సాంగ్ కు జక్కన్న వేసిన డ్యాన్స్ వీడియో.. నెట్టింట ఫుల్ గా చక్కర్లు కొడుతోంది.

ఇక జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు శ్రీసింహ. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. ఆ తర్వాత మత్తు వదలరా మూవీతో హీరోగా మారారు. డెబ్యూ చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే, ఉస్తాద్ వంటి చిత్రాల్లో నటించారు.

రీసెంట్ గా మత్తు వదలరా సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్లే ఆ సినిమాతో అలరించారు. తన ఖాతాలో మరో హిట్ ను వేసుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మురళి మోహన్ మనవరాలు రాగ మాగంటితో ఏడడుగులు నడిచారు.