Begin typing your search above and press return to search.

రాజమౌళి.. ఈ లుక్కులో కేక

అయితే రాజమౌళి దర్శకుడిగానే కాకుండా ఒకట్రెండు సినిమాలలో నటనతో కూడా ఎట్రాక్ట్ చేశాడు.

By:  Tupaki Desk   |   12 Oct 2024 9:30 PM GMT
రాజమౌళి.. ఈ లుక్కులో కేక
X

మన గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి మాత్రం ఒక దర్శకుడిగా కాకుండా ఒక స్పెషల్ లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. రాజమౌళి తన దర్శక ప్రతిభతో తెలుగు సినిమా స్థాయిని గ్లోబల్ లెవెల్లో నిలబెట్టారు. 'బాహుబలి' సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఆయన, 'ఆర్ఆర్ఆర్'తో ఆస్కార్ స్థాయి విజయం సాధించి దాదాపుగా అన్ని గౌరవాలను సొంతం చేసుకున్నారు.


అయితే రాజమౌళి దర్శకుడిగానే కాకుండా ఒకట్రెండు సినిమాలలో నటనతో కూడా ఎట్రాక్ట్ చేశాడు. ఇటీవల ఆయన ప్రభాస్ హీరోగా వచ్చిన 'కల్కి 2898 ఏ.డి' చిత్రంలో ఒక కీలక క్యామియో పాత్రలో కనిపించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రాజమౌళి లుక్ ని మొదట సీక్రెట్ గా ఉంచారు. కానీ సినిమా చూశాక అందరూ ఫిదా అయ్యారు.


తాజాగా, ఆయన లుక్ కి సంబంధించిన స్టిల్స్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో జక్కన్న బ్రౌన్ టీ షర్ట్ మరియు స్టైలిష్ జాకెట్ లో కనిపించారు. ఈ లుక్ లో ఆయన పూర్తిగా మాస్ అవతారంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ లుక్ చూసిన అభిమానులు ఆయన నెక్స్ట్ కల్కి పార్ట్ 2 ప్రాజెక్టులో కూడా ఇలాగే ఉండాలని ఆశిస్తున్నారు.

రాజమౌళి లాంటి లెజెండరీ దర్శకుడు ఇలా ఒక స్పెషల్ పాత్రలో కనిపించడం అభిమానులను ఖుషీ చేస్తోంది. ఇది ఇలా ఉండగా, రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్టును సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఇప్పటినుంచే భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు కెరీర్ లో ఇది మరో ల్యాండ్ మార్క్ మూవీగా నిలుస్తుందని భావిస్తున్నారు.

ఈ సినిమా హాలీవుడ్ స్థాయి యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కనుంది. అంతేకాకుండా ఇది మహేష్ బాబు మొదటి పాన్ వరల్డ్ సినిమా కావడం విశేషం. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2025లో ప్రారంభం కానుంది. సినిమా యూనిట్ ఇప్పటినుంచే అన్ని ఏర్పాట్లు చేస్తూ చిత్రీకరణకు సిద్ధం అవుతోంది. ఇకపోతే, ఈ సినిమా స్క్రిప్ట్ ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ లో ఉంది. సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మధ్యలో ప్రారంభం కానుంది, ఇక సినిమా విడుదలకు మూడేళ్ళ సమయం పట్టవచ్చు.