ఒడిశా అడవి నుంచి # ఎస్ఎస్ఎంబీ29 లీకులా!
సినిమా షూటింగ్ అంటే భద్రత పరంగా ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 7 March 2025 1:30 PM ISTసినిమా షూటింగ్ అంటే భద్రత పరంగా ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. కేవలం కొంత మంది కి మాత్రమే స్పాట్ లో కి ఫోన్లు తీసుకెళ్లే వెసులు బాటు ఉంటుంది. మిగతా వారంతా నిబంధ నలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే. స్మార్ట్ ఫోన్ అన్నది స్పాట్ లో కనిపించడానికి వీల్లేదు. బయట వ్యక్తులు ఎవరైనా ఆన్ సెట్స్ ని విజిట్ చేసినా పోన్లు సెక్యురిటీకి ఇచ్చి వెళ్లాల్సి ఉంటుంది.
స్టూడియోల్లో షూటింగ్ జరిగితే ఇదంతా పక్కాగా అమలవుతుంది. అదే షూటింగ్ ఔట్ డోర్ లో జరిగితే దర్శక, నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ఎందుకంటే భద్రత అనుకున్న విధంగా ఉండదు. అందులోనూ అటవీ ప్రాంతాలకు వెళ్లి షూటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు పరిస్థితి ఇంకా సవాల్ గా మారుతుంది. తాజాగా ఎస్ ఎస్ ఎంబీ 29 బృందం అదే పరిస్థితుల్లో కనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో జరుగుతోన్న సంగతి తెలిసిందే. మహేష్, పృధ్వీరాజ్ సుకుమా రన్, ప్రియాంక చోప్రా సహా అంతా స్పాట్ కి చేరుకున్నారు. నేటి నుంచి కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. అయితే మహేష్ సెట్స్ కి వెళ్లడంతో? ఒడిశా మీడియా ఈ విషయాన్ని ఓ రేంజ్ లో హైలైట్ చేస్తుంది. అడవి మొత్తాన్ని జల్లెడ వేసి మరీ ఫోకస్ చేస్తుంది. ఒడిశాలోని టీవీ ఛానెల్‌లు సెట్ నిర్మాణాన్ని విస్తృతంగా కవర్ చేయడంతో టీమ్ ఊహించని సవాలును ఎదుర్కొంటోంది.
ఇది నిరంతర లీక్‌లకు దారితీసిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మీడియా సిబ్బంది , సోషల్ మీడియా వినియోగదారులు సెట్స్ నుండి విజువల్స్ క్యాప్చర్ చేయడంతో మహేష్ , ఇతర కీలక పాత్రల లుక్స్ రివీల్ చేయబడతాయా? అనే ఆందోళన చెందుతుంది. అలాగే స్పాట్ నుంచి షూటింగ్ విజువల్స్ ఏవైనా బయట వ్యక్తులు క్యాప్చర్ చేస్తున్నారా? అన్న అనుమానం కూడా ఉంది.
ఎందుకంటే అదంతా దట్టమైన అడవి. అందులో ఎవరు ఎక్కడ నుంచి క్యాప్చర్ చేసినా తెలియదు. చిన్న పుటేజ్ తోనే లక్షలు సంపాదించుకునే అవకాశం ఉండటంతో ఛాన్స్ తీసుకుంటే? మాత్రం టెన్షన్ తప్పదు. ఇప్పటి వరకూ ఈ సినిమాకి సంబంధించి ఎక్కడా ఎలాంటి లీక్ జరగలేదు. కేవలం మహేష్ లాంగ్ హోయిర్ లుక్ తప్ప ఇంకేది బయటకు రాలేదు. అదీ మహేష్ ప్రయివేట్ ఈవెంట్ ద్వారా వచ్చిన ఫోటోలు మాత్రమే. తాజా పరిణామాల నేపథ్యంలో రాజమౌళి భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది.