విదేశాల్లో ప్లాన్ చేసిన మహేష్ అండ్ కో!
# ఎస్ ఎస్ ఎంబీ 29 ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత నెలలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
By: Tupaki Desk | 18 Feb 2025 5:53 AM GMT# ఎస్ ఎస్ ఎంబీ 29 ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత నెలలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. అనంతరం యూనిట్ చిన్న విరామం తీసుకుంది. తాజాగా ఆ విరామం ముగించు కుని యూనిట్ మళ్లీ సెట్ లోకి అడుగు పెట్టింది. ఈ గ్యాప్ లో హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరి పెళ్లి పనులు చూసుకుంది. తాజాగా మళ్లీ ప్రియాకం టీమ్ తో జాయిన్ అయింది. ఈ సినిమా కోసం ఇప్పటికే హైదరాబాద్ లో పలు చోట్ల భారీ సెట్లు వేసారు.
అందులో ఓ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. షూట్ లో ప్రియాంక కూడా పాల్గొంటుంది. ఈనెలంతా కూడా అక్కడే చిత్రీకరణ నిర్వహిస్తారని సమాచారం. అయితే తదుపరి షెడూల్స్ మాత్రం విదేశాల్లో మొదల వుతాయని చిత్ర వర్గాలు అంటున్నాయి. వేసవిలో షూటింగ్ అంతా విదేశాల్లో చేయాలని ప్లాన్ చేస్తు న్నారుట. ఇండియాలో అయితే తీవ్రమైన ఎండలు తప్పవు. అందులోనూ ఈ ఏడాది భానుడి భగ భగలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ కేంద్ర హెచ్చరిం చింది.
దీంతో అంత ఎండలో షూటింగ్ నిర్వహించడం అంటే కష్టం. షూటింగ్ చేసినా? అనారోగ్యాల పాలు అయ్యే అవకాశం ఉంటుంది. టీమ్ లో ప్రధాన వర్గం అనారోగ్యానికి గురైందంటే? నష్టం భారీగా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకునే రాజమౌళి-మహేష్ ఈ సమ్మర్ అంతా విదేశాల్లోని చల్లగా ఉండే ప్రదేశాల్లో షూటింగ్ చేయాలనుకుంటున్నారుట. ఫారెస్ట్ డ్యాక్ డ్రాప్ లో చాలా సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉన్న నేపథ్యంలో అలాంటి సన్నివేశాలు కొన్ని విదేశీ అడవుల్లో చిత్రీకరిస్తే బాగుంటుందనే భావిస్తున్నారుట.
దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదే జరిగితే మహేష్ సమ్మర్ వెకేషన్ కూడా ఆ రకంగా పూర్తయిపోతుంది. ఫ్యామిలీని తనతో పాటు షూటింగ్ తీసుకెళ్లిపోతే ఓ వైపు షూటింగ్....షూట్ లేని సమయంలో వెకేషన్ కూడా ముగించొచ్చు.