రాజమౌళిని లైట్ తీసుకున్న మహేష్..?
అందుకే రాజమౌళిని అందరు పని రాక్షసుడు అంటారు. తను సినిమాకు అంత కష్టపడతాడు కాబట్టే రాజమౌళి సినిమా ఎప్పుడు ఆడియన్స్ ని నిరుత్సాహపరచదు.
By: Tupaki Desk | 21 March 2025 6:59 PM ISTదర్శకధీరుడు రాజమౌళితో సినిమా అంటే స్టార్ హీరోలు సైతం అలర్ట్ గా ఉంటారు. సినిమాకు ఏళ్లకు ఏళ్లు టైం తీసుకుంటాడనే కానీ దాని తగినట్టుగా ఫలితం కూడా ఉంటుందని తెలిసి స్టార్స్ కూడా రాజమౌళి సినిమా కోసం క్యూ కడతారు. అంతేకాదు రాజమౌళితో సినిమా ఓకే చేయడం ఒక ఎత్తైతే అతను కోరుకునేలా పనిచేయడం కోసం బాగా కష్టపడాల్సి వస్తుంది. అందుకే రాజమౌళిని అందరు పని రాక్షసుడు అంటారు. తను సినిమాకు అంత కష్టపడతాడు కాబట్టే రాజమౌళి సినిమా ఎప్పుడు ఆడియన్స్ ని నిరుత్సాహపరచదు.
RRR తర్వాత రాజమౌళి మహేష్ తో సినిమా మొదలు పెట్టాడు. సైలెంట్ గా షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా గురించి ఎలాంటి లీక్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నాడు రాజమౌళి. ఐతే ఈ సినిమా విషయంలో మహేష్ కి జక్కన్న రూల్స్ పెట్టాడని వార్తలు వచ్చాయి. మహేష్ సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలను చేస్తుంటాడు. వాటి ద్వారా వచ్చిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాడు.
ఇదిలా ఉంటే మహేష్ లేటెస్ట్ గా ట్రెండ్స్ యాడ్ లో కనిపించాడు. సినిమా మొదలు పెట్టాక ఎలాంటి యాడ్స్ చేయకూడదని రాజమౌళి కండీషన్ ని సైతం మహేష్ బ్రేక్ చేశాడని అందరు అంటున్నారు. మహేష్ లుక్స్ చూస్తే ఇది ఈమధ్య చేసిన దానిలాగే ఉంది. మరి రాజమౌళికి ఏం చెప్పి మహేష్ ఈ యాడ్ చేశాడి కానీ సూపర్ స్టార్ లుక్స్ చూసి ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు.
ఐతే మరోపక్క మహేష్ లుక్స్ రివీల్ చేయడంలో కూడా రాజమౌళి ప్లాన్ ఉందని అంటున్నారు. ఏది ఏమైనా రాజమౌళి సినిమా మొదలైంది ఇక మహేష్ ని రిలీజ్ అయితే తప్ప చూడలేం అనుకున్న ఫ్యాన్స్ కి ఈ యాడ్స్ సర్ ప్రైజ్ చేస్తున్నాయి. మహేష్ తో పాటు ఈ ట్రెండ్స్ యాడ్ లో సితార పాప కూడా నటించింది.
రాజమౌళి మహేష్ కాంబో సినిమాపై హ్యూజ్ బజ్ ఉంది. ఈ సినిమాపై ఇంటర్నేషనల్ లెవెల్ లో అంచనాలు ఉన్నాయి. ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో విజువల్ ట్రీట్ అనిపించేలా చాలా సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమా తప్పకుండా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కే కాదు సినీ లవర్స్ అందరినీ కూడా సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ తో పాటు ప్రియాంక చోప్రా, పృధ్విరాజ్ సుకుమారన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఐతే సినిమాలో నటించే కాస్టింగ్ ఇంకా టెక్నికల్ టీం పై త్వరలో రాజమౌళి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది.