SSMB29: తండ్రి పాత్ర - టైటిల్.. ఫిక్స్ అయినట్లేనా?
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB29 గురించి ప్రతి అప్‌డేట్ భారీ అంచనాలను పెంచుతోంది
By: Tupaki Desk | 8 Feb 2025 6:58 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB29 గురించి ప్రతి అప్‌డేట్ భారీ అంచనాలను పెంచుతోంది. రాజమౌళి కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్, హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కనుందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. పైగా, ఈ సినిమా పూర్తిగా ప్రపంచ స్థాయి కథతో ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీగా రూపొందుతుండటంతో ఆసక్తి మరింత పెరిగింది.
ఇక మహేష్ బాబుకు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందుతుండటంతో ప్రియాంకను ఎంపిక చేశారని సమాచారం. ఇప్పటికే మహేష్-ప్రియాంక హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్వహించిన వర్క్ షాప్ లో.పాల్గొన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ సినిమా రేంజ్‌లో తెరకెక్కించేందుకు రాజమౌళి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఖరారైనట్టు తెలుస్తోంది. మొదట ‘మహారాజ్’ అనే టైటిల్ వినిపించగా, తర్వాత ‘గరుడ’ అనే పేరు తెరపైకి వచ్చింది. కానీ ఇవి పాత టైటిళ్లుగా భావించి రాజమౌళి కొత్తదానిపై దృష్టి పెట్టినట్టు సమాచారం. తాజా సమాచారం ప్రకారం, 'జనరేషన్' అనే కాన్సెప్ట్‌తో ఓ గ్లోబల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కథ తరతరాల అనుబంధంతో సాగుతుందని, అందుకే టైటిల్ కూడా తరం నుంచి తరానికి కనెక్ట్ అయ్యేలా ఉంచాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
అలాగే సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రకు విశేషమైన ప్రాధాన్యం ఉందని టాక్. ఇప్పటికే బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం. అయితే, ఆయన పాత్ర ఏంటనేది ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. మహేష్ తండ్రి పాత్రకే నానా పాటేకర్‌ను ఎంపిక చేశారా? లేక వేరే కీలక పాత్రలో కనిపించనున్నారా? అనే విషయం మీద సస్పెన్స్ కొనసాగుతోంది.
ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజమౌళి ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కించేందుకు హాలీవుడ్ టెక్నీషియన్లను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. విదేశీ టెక్నీషియన్లు, గ్రాఫిక్స్ టీమ్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ప్రత్యేకంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో అడ్వెంచర్, యాక్షన్ అంశాలు ప్రధానంగా ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్టు సమాచారం.
ఇక ఈ సినిమా అసలు పనులు ప్రారంభమైనట్లు తెలిసినప్పటికీ, అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. సాధారణంగా రాజమౌళి తన సినిమాల గురించి మొదట ప్రెస్‌మీట్ పెట్టి క్లారిటీ ఇస్తారు. కానీ ఈసారి అది జరగలేదు. సినిమా ప్రారంభించడమే కాకుండా కొన్ని సన్నివేశాలను కూడా షూట్ చేయడం గమనార్హం. మరి, ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌పై ఉన్న ఉత్కంఠకు రాజమౌళి ఎప్పుడు తెరదించుతారనేది చూడాలి.