డిమాండ్ చేస్తే.. రాజమౌళి తగ్గే దర్శకుడేనా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో SSMB 29 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 24 Feb 2025 12:16 PM GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో SSMB 29 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది చివర్లో చాలా సీక్రెట్ గా పూజా కార్యక్రమాలు జరగ్గా.. కొద్ది రోజుల క్రితం అంతే సీక్రెట్ గా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఒక పిక్ కూడా బయటకు రాలేదు.
రాజమౌళి మాత్రం చిన్న వీడియోతో షూటింగ్ స్టార్ట్ అయినట్లు హింట్ ఇచ్చారు. దీంతో అటు సినీ ప్రియులు.. ఇటు మహేష్ అభిమానులు.. అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పటిలానే రాజమౌళి.. మరికొద్ది రోజుల్లో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి అన్ని విషయాలు రివీల్ చేయనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
అయితే సినిమాలో మహేష్ నటిస్తున్నట్లు తప్ప.. ఇతర క్యాస్టింగ్ కోసం ఎలాంటి అప్డేట్ లేదు. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా యాక్ట్ చేస్తున్నట్లు జక్కన్న పోస్ట్ ద్వారా ఆమెనే క్లారిటీ ఇచ్చింది. అంతకుముందు నెట్టింట వార్తలు రాగా.. ఆ తర్వాత అందరూ ఓ క్లారిటీకి వచ్చారు. కానీ మహేష్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు!
మహేష్ పక్కన హీరోయిన్ గా ఆమె సెట్ కాదని అభిప్రాయపడ్డారు. కానీ జక్కన్న ప్లానింగ్ వెనుక పెద్ద ఉంటుందని కాస్త నచ్చజెప్పుకున్నట్లు కనిపించారు. అదే సమయంలో అనేక రూమర్స్ వచ్చాయి. ఆమెకు రూ.35 కోట్ల పారితోషికాన్ని జక్కన్న ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.
ఇప్పుడు ఆమె కోసం స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో నిజమెంతో తెలియకపోయినా.. ప్రియాంక చోప్రాకు ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ ఉండడం వల్ల ఆ నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రియాంక కోసం మళ్లీ రాజమౌళి రాజీ అయ్యారని అనేక మంది అంటున్నారు. నిజానికి రాజమౌళి తగ్గే దర్శకుడేనా అనే సందేహం అయితే రాకుండా ఉండదు. గతంలో బాహుబలి కోసం బిగ్ స్టార్స్ ను కలిసినా కూడా వారి డిమాండ్స్ కు అసలు తగ్గలేదు.
ఇక రాజమౌళి తో చిన్న ఛాన్స్ వచ్చినా చేసేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి రూమర్స్ పై.లాస్థ సందేహంగానే ఉంటాయి. అయితే జక్కన్న ఒకవేళ మార్చాలని అనుకున్నా అంత ఈజీగా ఒప్పుకోరు. అయితే ఒక డైరెక్టర్ కు స్క్రిప్ట్, రోల్స్ పై కచ్చితంగా అవగాహన ఉంటుంది. ఆ విషయంలో జక్కన్న ఏం తక్కువ కాదు. కాబట్టి మరీ ఎక్కువగా తొందరపడక్కర్లేదని నెటిజన్లు చెబుతున్నారు. ఏదేమైనా వస్తున్న వార్తలు నిజమో కాదో కూడా తెలియదు కదా అని అంటున్నారు.