Begin typing your search above and press return to search.

SSMB29: జక్కన్న వేట మొదలైందిగా..

దర్శక దిగ్గజం రాజమౌళి నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 Oct 2024 9:40 AM GMT
SSMB29: జక్కన్న వేట మొదలైందిగా..
X

దర్శక దిగ్గజం రాజమౌళి నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని కెఎల్ నారాయణ నిర్మించబోతున్నారు. సుమారు 1000 కోట్లకి పైగా బడ్జెట్ ఈ సినిమా కోసం కేటాయిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మూవీ అఫీషియల్ ఎనౌన్సమెంట్ ఎప్పుడు వస్తుందా అనే సూపర్ స్టార్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

ఇప్పటికే మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపొయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు క్యాస్టింగ్ ఎంపికపై జక్కన్న ఫోకస్ చేస్తూనే మరో వైపు ఇతర పనులలో కూడా వేగం పెంచుతున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ‘SSMB29’ సినిమాకి కావాల్సిన లొకేషన్స్ వేటలో రాజమౌళి ఉన్నారు. తాజాగా ఆయన ఫారెస్ట్ మధ్యలో జీప్ లో కూర్చొని ప్రయాణం చేస్తోన్న వీడియోని రాజమౌళి తనయుడు కార్తికేయ షూట్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

ఈ వీడియోలో రాజమౌళి మహేష్ బాబు ‘టక్కరిదొంగ’ సినిమాలోని నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో పాట వింటూ ప్రయాణం చేస్తున్నారు. సిచువేషన్ కి తగ్గట్లుగానే ఈ పాటకూడా ఉందనే కామెంట్స్ ఆ వీడియోని చూసిన వారు చేస్తున్నారు. జక్కన్న అయితే విశ్రాంతి లేకుండా ‘SSMB29’ సినిమాకి సంబందించిన గ్రౌండ్ వర్క్ మొత్తం చేసుకుంటున్నట్లు ఈ వీడియో బట్టి అర్ధమవుతోంది. అయితే జక్కన్న ప్రయాణిస్తున్న ఫారెస్ట్ ఎక్కడిదనేది క్లారిటీ లేదు.

సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ కథ అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఇప్పటికే చెప్పారు. అలాగే వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ గా మహేష్ బాబు పాత్ర ఉండబోతోందని కన్ఫర్మ్ చేశారు. దానికి తగ్గట్లుగానే రియల్ లొకేషన్స్ లోనే మూవీ షూటింగ్ చేయడం కోసం ప్లాన్ చేస్తున్నారు. అందుకే లొకేషన్స్ వెతికే ప్రయాణం జక్కన్న మొదలెట్టినట్లు తెలుస్తోంది.

ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాతో రాజమౌళి వరల్డ్ వైడ్ గా ఎలాంటి అద్భుతాలు చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా కోసం చాలా మంది హాలీవుడ్ యాక్టర్స్ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు ఓ కీలక పాత్ర కోసం వినిపించింది. ఈ సినిమా గురించి పూర్తిస్థాయిలో అప్డేట్ రావాలంటే జక్కన్న నుంచి క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.