Begin typing your search above and press return to search.

SSMB 29: మొదలయ్యేది ఎప్పుడంటే..

టాలీవుడ్‌లోనే కాకుండా నేషనల్ వైడ్ గా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ మహేష్ బాబు - రాజమౌళి కాంబో.

By:  Tupaki Desk   |   11 Sep 2024 10:49 AM GMT
SSMB 29: మొదలయ్యేది ఎప్పుడంటే..
X

టాలీవుడ్‌లోనే కాకుండా నేషనల్ వైడ్ గా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ మహేష్ బాబు - రాజమౌళి కాంబో. ఈ కాంబో ఎప్పటి నుంచో తెరపైకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎట్టకేలకు ఈ కాంబో సినిమాకు సంబంధించిన పనులు ప్రారంభం కాబోతున్నాయి. అసలైతే ఈ ఏడాది సమ్మర్ లోనే సినిమాను స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ స్క్రిప్ట్ పనులు ఆలస్యం కావడంతో జక్కన్న ఇంకాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటూ ఉన్నాడు.

‘గుంటూరు కారం’ సినిమా మిక్స్ డ్ టాక్ తీసుకురావడంతో మహేష్ ఫ్యాన్స్ కొంచెం నిరాశతో ఉన్నారు. అయితే, రాజమౌళి సినిమా ద్వారా తిరిగి విజయపథంలోకి రావడం ఖాయమని వారి నమ్మకం. ఈ సినిమా గురించి వస్తున్న తాజా సమాచారం ప్రకారం, ‘SSMB29’ ప్రాజెక్ట్ 2025 జనవరిలో సెట్స్‌పైకి వెళ్ళనుందట. ఈ సినిమాలో మహేష్ బాబు ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

మరొక ఆసక్తికరమైన టాక్ ఏమిటంటే వచ్చే నెలలోనే పూజా కార్యక్రమాలు ఉండవచ్చు అని తెలుస్తోంది. అక్టోబర్ 10న రాజమౌళి పుట్టినరోజు. బహుశా అదే టైక్ లో లాంచ్ కావచ్చని తెలుస్తోంది. ఇక సినిమాలో పృథ్వీ రాజ్ సుకుమార్ కూడా ఉంటాడు అని ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు నిజం అనేది రాజమౌళి క్లారిటీ ఇస్తే గాని నమ్మలేము.

సూపర్ స్టార్ మహేష్ తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని, సరికొత్త పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంతో ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కబోతోందట. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉంటుంది అని ఇదివరకే కథ రచయిత విజేయేంద్ర ప్రసాద్ ఒక క్లారిటీ ఇచ్చారు.

విదేశాల్లో షూట్ చేయబోయే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫీల్డ్ వర్క్, ప్రీప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా, భారీ విజువలైజేషన్, వర్క్ షాప్స్ పై జక్కన్న దృష్టి సారించాడు. మహేష్ బాబుకు రాజమౌళి దర్శకత్వంలో నటించడం అత్యంత ప్రత్యేకమై విషయం, కాబట్టి ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

2026 చివరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనా. అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. మొత్తం మీద, ఈ సినిమా టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో కూడా సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. ఇక సినిమాలో స్టార్స్ గా ఎవరెవరు కనిపిస్తారు అనేది మరొక ఆసక్తికరమైన విషయం. హాలీవుడ్ నటులను కూడా తీసుకోవాలి అని జక్కన్న అనుకుంటున్నారట.