Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి సొంత క‌థ‌తో స‌త్తా చాటెదెప్పుడు?

క్రియేట‌వ్ గా సీన్స్ క్రియేట్ చేయ‌డంలో జ‌క్క‌న్న విజ‌న్ కి స‌లాం కొట్టాల్సిందే. కానీ రాజ‌మౌళి సినిమా విష‌యంలో ఆ ఒక్క‌టే త‌క్కువైంది.

By:  Tupaki Desk   |   27 Dec 2024 11:30 PM GMT
రాజ‌మౌళి సొంత క‌థ‌తో స‌త్తా చాటెదెప్పుడు?
X

ఇండియ‌న్ గ్రేట్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి. మేక‌ర్ గా అత‌డి గ్రాప్ అంత‌కంత‌కు పెరుగుతూనే ఉంది. `బాహుబ‌లి` నుంచి జ‌క్క‌న్న పాన్ ఇండియా ప్రస్థానం మొద‌లైంది. అటుపై `ఆర్ ఆర్ ఆర్` తో హాలీవుడ్ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకునే స్థాయికి చేరుకున్నారు. హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామోరూన్ లాంటి దిగ్గ‌జంతోనే షెభాష్ అనిపించారు. త్వ‌ర‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో గ్లోబ్ ట్రాటింగ్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ ని రూపొందిస్తున్నారు.

క్రియేట‌వ్ గా సీన్స్ క్రియేట్ చేయ‌డంలో జ‌క్క‌న్న విజ‌న్ కి స‌లాం కొట్టాల్సిందే. కానీ రాజ‌మౌళి సినిమా విష‌యంలో ఆ ఒక్క‌టే త‌క్కువైంది. అదే సొంత క‌థ‌తో స‌త్తా చాట‌లేక‌పోవ‌డం. రాజ‌మౌళి సినిమా చేయాలంటే వెనుక నుంచి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందించాల్సిందే. ఇప్ప‌టి వ‌ర‌కూ రాజ‌మౌళి సొంత క‌థ‌తో సినిమా లేదు. తొలి సినిమా `స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్` కి స్టోరీ అందించింది పృథ్వీరాజ్. ఆ త‌ర్వాత తెర‌కెక్కించిన `సింహాద్రి`, ` సై`, `ఛ‌త్ర‌ప‌తి`,` విక్ర‌మార్కుడు`, `య‌మ‌దొంగ‌`, ` మ‌గ‌ధీర‌`, `బాహుబ‌లి` రెండు భాగాల‌కు,` ఆర్ ఆర్ ఆర్` వ‌ర‌కూ విజ‌యేంద్ర ప్ర‌సాద్ స్టోరీ అందించారు.

మ‌ధ్య‌లో `ఈగ` సినిమాకి మాత్రం విజ‌యేంద్ర ప్ర‌సాద్ కేవ‌లం కాన్సెప్ట్ మాత్ర‌మే ఇచ్చారు. ఆ క‌థ‌ని ఎస్టాబ్లిష్ చేసింది రాజ‌మౌళి. `మ‌ర్యాద రామ‌న్న‌`కు ఎస్. ఎస్ కాంచి స్టోరీ ఇచ్చారు. దాన్ని విస్త‌రించ‌డంలో రాజ‌మౌళి పాత్ర ఉంది. అలా ఆ రెండు సినిమాల ప‌రంగా రాజ‌మౌళి స్టోరీ రైటింగ్ లో ప‌నచేసారు. తండ్రి క‌థ‌ల్లో కేవ‌లం భాగ‌స్వామిన‌కే ప‌రిమితం. కానీ సొంత క‌థ కోసం మాత్రం తాను ఇంకా క‌లం ప‌ట్ట‌లేదు.

దీంతో రాజమౌళి సొంత క్రియేటివిటీతో ఓ క‌థ సిద్దం చేసి సినిమా తీస్తే చూడాల‌ని ఆయ‌న పాన్ ఇండియా అభిమానులు ఆశీస్తున్నారు. సౌత్ నుంచి పాన్ ఇండియాలో సినిమాలు చేసిన ప్ర‌శాంత్ నీల్, ప్ర‌శాంత్ వ‌ర్మ‌, చందు మొండేటి, రిష‌బ్ శెట్టి వీళ్లంతా సొంత క‌థ‌ల‌తోనే సినిమాలు చేసి స‌క్సెస్ అందుకున్నారు. వాళ్ల స‌ర‌స‌న రాజ‌మౌళి ఎప్పుడు చేర‌తారు అన్న‌ది ప్ర‌శ్న‌?