Begin typing your search above and press return to search.

RRR డాక్యుమెంటరీ.. ఆ ముగ్గురిపై జక్కన్న ప్రశంసల వర్షం!

ఆర్ఆర్ఆర్.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆ సినిమా.. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   28 Dec 2024 8:06 AM GMT
RRR డాక్యుమెంటరీ.. ఆ ముగ్గురిపై జక్కన్న ప్రశంసల వర్షం!
X

ఆర్ఆర్ఆర్.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆ సినిమా.. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన విషయం తెలిసిందే. 2022లో విడుదలైన ఆ మూవీ.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి భారీ వసూళ్లను రాబట్టింది. రూ.1300 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు సృష్టించింది.

అదే సమయంలో ఎన్నో ఘనతలు.. మరెన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఏకంగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు దక్కించుకుంది ఆర్ఆర్ఆర్. అయితే ఆ సినిమా మేకర్స్.. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో డాక్యుమెంటరీ సిద్ధం చేసిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం థియేటర్లలో రిలీజ్ చేసింది.

ఇప్పుడు ఫేమస్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఆ డాక్యుమెంటరీ.. సినిమాలోని కీలక సీన్స్ షూటింగ్ బిహైండ్ ద సీన్స్, ఫన్నీ మూమెంట్స్, క్యాస్టింగ్ అనుభవాలతో రూపుదిద్దుకుంది. ఎన్టీఆర్ ను చరణ్ కొరడాతో కొట్టిన సీన్, రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ కు సంబంధించిన విషయాలు ఇప్పుడు తెగ ఆకట్టుకుంటున్నాయి.

దీంతో సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ కోసమే చర్చ జరుగుతోంది. అనేక మంది నెటిజన్లు.. ఆర్ఆర్ఆర్ టీమ్ కష్టాన్ని కొనియాడుతున్నారు. డాక్యుమెంటరీలోని కొన్ని సీన్స్ హార్ట్ కు టచ్ అయ్యాయని.. సూపర్ డాక్యుమెంటరీ అని కామెంట్స్ పెడుతున్నారు. అదే సమయంలో జక్కన్న నెట్టింట స్పెషల్ పోస్ట్ పెట్టారు.

డాక్యుమెంటరీ కోసం పని చేసిన వారిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. అద్భుతంగా వర్క్ చేశారన్న ఆయన.. ప్రశంసలు కురిపించారు. డాక్యుమెంటరీ టీమ్ లో ఉన్న ప్రదీప్ కోసం మాట్లాడారు. అతడిని 13 ఏళ్ల క్రితం కలిశానని, ఒక ఫ్యాన్ గా తెలుసని తెలిపారు,. ఇప్పుడు ప్రదీప్ తో పాటు అతడి డీమ్ డాక్యుమెంటరీకి వర్క్ చేశారని అన్నారు.

డాక్యుమెంటరీ కోసం వారంతా ఎంతో కష్టపడ్డారని రాజమౌళి తెలిపారు. శిరీష, వంశీ మంచి టాలెంట్‌ ఉన్న ఎడిటర్లు అని కొనియాడారు. 20టీబీ డేటాలో సరైన ఫుటేజ్‌ను కనుగొనడం అంత ఈజీ విషయం కాదని అన్నారు. సినిమా కంటే డాక్యుమెంటరీ ఎమోషనల్‌ గా ఉందన్న వ్యాఖ్యలు వారి ప్రతిభకు నిదర్శనమని తెలిపారు. టీమ్ విషయంలో చాలా గర్వ పడుతున్నట్లు పేర్కొన్నారు. కీప్ ఇట్ అప్ అంటూ బెస్ట్ విషెస్ తెలిపారు.