Begin typing your search above and press return to search.

SSMB 29: జక్కన్నకు ఎంత లాభమంటే..

దీంతో ఏ క్షణమైనా అప్డేట్ రావొచ్చని.. సినీ ప్రియులు, మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 Oct 2024 12:30 AM GMT
SSMB 29: జక్కన్నకు ఎంత లాభమంటే..
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అనౌన్స్మెంట్ తప్ప మరో అప్టేట్ రాలేదు. సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నా.. జక్కన్న ఒక్క విషయాన్ని కూడా ప్రకటించడం లేదు. కొద్ది రోజుల క్రితం మహేష్ బర్త్ డే సందర్భంగా.. అప్డేట్ వస్తుందని అంచనా వేసినా అది కూడా జరగలేదు. దీంతో ఏ క్షణమైనా అప్డేట్ రావొచ్చని.. సినీ ప్రియులు, మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌ లో యాక్షన్ అడ్వెంచర్‌ గా SSMB29 మూవీ రాబోతుందని ఇప్పటికే రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ పలుమార్లు తెలిపారు. రీసెంట్ గా జనవరిలో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇన్ డైరెక్ట్ గా చెప్పారు. అదే సమయంలో కీరవాణి మ్యూజిక్ వర్క్ ను స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు.. ఇప్పటికే మేకోవర్ చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్నడూ చూడని విధంగా తన లుక్స్ తో షాక్ ఇస్తున్నారు.

లాంగ్ హెయిర్, గుబురు గెడ్డంతో సూపర్ స్టార్ కనిపిస్తున్నారు. బాడీని కూడా బాగా పెంచుతున్నట్లు తెలుస్తోంది. జిమ్ లో మహేష్ గట్టిగా వర్కౌట్స్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు రాజమౌళి.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. వర్క్ షాప్ కూడా నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. షూటింగ్ లొకేషన్స్ ను ఫిక్స్ చేస్తున్నారట. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. SSMB29తో ఆయనకు మంచి లాభం అందనుందని నెటిజన్లు చెబుతున్నారు.

సాధారణంగా.. తాను తెరకెక్కించిన సినిమాలకు గాను రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్స్ లో షేర్ కూడా జక్కన్న తీసుకుంటారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ కు ఆ విధంగానే పెద్ద మొత్తంలో అందుకున్నారని అప్పట్లో టాక్ వినిపించింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ప్రాఫిట్ షేర్ అందుకున్నట్లు సమాచారం. కానీ సినిమాలో ఇద్దరు హీరోలు కావడంతో రాజమౌళికి రావాల్సిన లాభాల వాటా కాస్త తగ్గిందట.

ఇప్పుడు SSMB29లో మహేష్ ఒక్కరే హీరో కనుక.. జక్కన్నకు భారీగా ప్రాఫిట్ షేర్ అందనుందని చెబుతున్నారు. రాజమౌళికి పాన్ వరల్డ్ లెవెల్ లో క్రేజ్ ఉండడంతో ఓటీటీ హక్కులు, ఓవర్సీస్ హక్కులు, థియేట్రికల్ హక్కులు.. పెద్ద మొత్తానికే అమ్ముడవుతాయి. కేఎల్ నారాయణ.. భారీ బడ్జెట్ తో నిర్మించనున్న SSMB29.. పాజిటివ్ మౌత్ టాక్ అందుకుంటే చాలు.. రాజమౌళికి కాసుల పంటే అన్న మాట.