SSMB 29 : జక్కన్న ప్లాన్ ఏంటి? ఎప్పుడూలేనంత ఈసారి ఎందుకలా?
కానీ ఇప్పటి వరకు రాజమౌళి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. మహేష్ తో మూవీ చేస్తున్నట్లు ఒక్క అనౌన్స్మెంట్ తప్ప మరో విషయాన్ని రివీల్ చేయలేదు.
By: Tupaki Desk | 7 Feb 2025 3:30 PM GMTదర్శకధీరుడు రాజమౌళి.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న మూవీతో బిజీ బిజీగా విషయం తెలిసిందే. కొన్ని నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరగ్గా.. గత ఏడాది పూజా కార్యక్రమాలు జరిగాయి. రీసెంట్ గా రెగ్యులర్ షూటింగ్.. హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో స్టార్ట్ అయింది!
కానీ ఇప్పటి వరకు రాజమౌళి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. మహేష్ తో మూవీ చేస్తున్నట్లు ఒక్క అనౌన్స్మెంట్ తప్ప మరో విషయాన్ని రివీల్ చేయలేదు. ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు ఆయన నేరుగా చెప్పలేదు. జక్కన్న పోస్టుకు ఆమె కామెంట్ పెట్టడంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది. కానీ ఆమె రోల్ ఏంటో కూడా ఎవరికీ తెలియదు.
పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క పిక్ లేదా వీడియో బయటకు రాలేదు. ఆ తర్వాత పోస్టర్ గానీ.. ఇంకా ఏ ప్రమోషనల్ కంటెంట్ ను కూడా రాజమౌళి రివీల్ చేయలేదు. నిజానికి.. ఆయన తన సినిమాలను ప్రమోట్ చేసే విధానంలో చాలా చురుగ్గా ఉంటారు. పలు విధాలుగా మూవీపై మంచి బజ్ క్రియేట్ చేస్తారు.
ఆర్ఆర్ఆర్ విషయంలో అదే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో దిగిన పిక్ ను అనౌన్స్మెంట్ టైమ్ లో పోస్ట్ చేయగా.. ఆ తర్వాత ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పలు విషయాలను పంచుకున్నారు. దీంతో ఇప్పుడు SSMB 29 విషయంలో సేమ్ సీన్ రిపీట్ అవుతుందని అంతా అనుకున్నారు.
కానీ రాజమౌళి మాత్రం ఎప్పుడూ లేనంతగా.. సైలెంట్ గా ముందుకు వెళ్తున్నారు. సోషల్ మీడియాలో ఉన్నవారికి కాకుండా మిగతా ఎవరికీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందని కూడా తెలియదేమో. దీంతో అసలు రాజమౌళి ఎందుకంత సైలెంట్ గా కానిస్తున్నారు? ఆయన ప్లాన్ ఏంటి? ఏం జరుగుతుంది? అని అంతా డిస్కస్ చేస్తున్నారు.
చేతిలో పాస్ పోర్ట్ పట్టుకుని.. సింహాన్ని బంధించిన వీడియోను షేర్ చేసిన జక్కన్న.. కనివినీ ఎరుగని స్థాయిలో మహేష్ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారని అంతా అంచనా వేస్తున్నారు. అందుకే సైలెంట్ గా ఉంటున్నారని చెబుతున్నారు. ఒక్కసారిగా సర్ప్రైజ్ చేస్తారేమోనని గెస్ చేస్తున్నారు. ఏదేమైనా వెయిటింగ్ ఫర్ అప్డేట్ అని అంటున్నారు. జక్కన్నపై ఫుల్ నమ్మకం ఉందని.. మూవీపై ఆసక్తిగా ఉన్నామని కామెంట్లు పెడుతున్నారు.