Begin typing your search above and press return to search.

రాజమౌళిలో ఉప్పొంగిన ఉత్సాహానికి రీజన్ ఇదే..!

కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహా పెళ్లి లో రాజమౌళి ఎంజాయ్ మెంట్ గురించి వీడియోల రూపంలో అందరు చూశారు.

By:  Tupaki Desk   |   21 Dec 2024 10:09 AM GMT
రాజమౌళిలో ఉప్పొంగిన ఉత్సాహానికి రీజన్ ఇదే..!
X

దర్శక ధీరుడు రాజమౌళికి సంబందించిన డ్యాన్స్ వీడియోలు ఈమధ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మన జక్కన్న ఏంటి ఏదైనా డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ అవుతాడా ఏంటి ఈ రేంజ్ లో డ్యాన్స్ లు చేస్తున్నాడు అనుకున్నారు ఆయన ఫ్యాన్స్. వేసుకున్న డ్రస్ కి ఆయన వేసే మాస్ స్టెప్పులకు అసలు సంబంధం లేదు. ఐతే ఆ డ్యాన్స్ వెనక రీజన్ ఏంటన్నది తెలిసింది. కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహా పెళ్లి లో రాజమౌళి ఎంజాయ్ మెంట్ గురించి వీడియోల రూపంలో అందరు చూశారు. రాజమౌళి ని ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్ తో కనిపిస్తారు. కానీ ఈసారి అలా కాకుండా కంప్లీట్ రిలాక్స్ మోడ్ లో కనిపించారు.

శ్రీ సింహా మ్యారేజ్ లో డ్యాన్సులతో ఎంటర్టైన్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ ని ఎంటర్టైన్ చేశాడు రాజమౌళి. ఐతే దీనికి సంబందించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. గత 10 రోజులుగా శ్రీ సింహా మ్యారేజ్ పనుల్లో ఎంతో సంతోషకరంగా గడిచిందని.. ఎన్నో మధురానుభూతులు పొందామని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. అంతేకాదు యూ.ఏ.ఈలో ఈ పెళ్లి వేడుక నిర్వహించిన అనంతర రాస్ అల్ ఖమా రిసార్ట్స్ వారిని కూడా పొగడ్తలతో ముంచెత్తాడు రాజమౌళి.

పెళ్లి మొదలైనప్పటి నుంచి వ్రతం వరకు అన్ని ఏర్పాటు వారు చాలా అద్భుతంగా చేశారని. ఇంట్లో జరిగినట్టుగా పెళ్లి జరిపించారని అన్నారు. రాజమౌళి ఎంత సాటిస్ఫై అయితేనో ఇలాంటి ట్వీట్స్ వేస్తాడని చెప్పొచ్చు. ముఖ్యంగా రాజమౌళి లాంట్ దిగ్గజ దర్శకుడి నుంచి ఇలాంటి ప్రశంసలు రావడం ఆ రిసార్ట్స్ పేరు మారు మోగిపోతుందని చెప్పొచ్చు. కేవలం సన్నిహితుల సమక్షంలోనే కీరవాణి తనయుడు శ్రీ సిం హ రాగ ల మ్యారేజ్ జరిగింది.

శ్రీ సింహా మత్తువదలరా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈమధ్యనే ఆ సినిమా పార్ట్ 2 తీసి హిట్ అందుకున్నాడు. రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ఈ పెళ్లి వేడుకలో బాగా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది. రాజమౌళి ఇప్పుడు ట్వీట్ చేశాడు కానీ ఆయన డ్యాన్స్ వీడియోలు గత రెండు రోజులుగా వైరల్ అవుతున్నాయన్న సంగతి తెలిసిందే. ఇక రాజమౌళి సినిమాల విషయానికి వస్తే మహేష్ తో చేయాల్సిన సినిమాను నెక్స్ట్ ఇయర్ మొదట్లోనే సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. మహేష్ కూడా ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు.