రాజమౌళి ఒక్కసారి కమిటైతే..!
రాజమౌళితో సినిమా అంటే ఎలా లేదన్నా ఒక 3 ఏళ్లు రాసివ్వాల్సిందే. అదే సినిమా రెండు భాగాలు అయితే ఐదేళ్లు మరో సినిమా గురించి ఆశలు వదులు కోవాల్సిందే.
By: Tupaki Desk | 3 Feb 2025 11:30 PM GMTరాజమౌళితో సినిమా అంటే ఎలా లేదన్నా ఒక 3 ఏళ్లు రాసివ్వాల్సిందే. అదే సినిమా రెండు భాగాలు అయితే ఐదేళ్లు మరో సినిమా గురించి ఆశలు వదులు కోవాల్సిందే. సినిమా పక్కన పెడితే కనీసం ఫ్యామిలీతో జాలీ ట్రిప్పులు కూడా రాజమౌళి పర్మిషన్ తీసుకుని వెళ్లాలి. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే మహేష్, ప్రియాంక మీద సీన్స్ షూట్ చేశారని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా విషయంలో రాజమౌళి నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో ఉన్నట్టు తెలుస్తుంది.
సినిమాకు ఎక్కడ టైం వేస్ట్ కాకుండా పర్ఫెక్ట్ షెడ్యూల్ తో వస్తున్నారట. ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ సినిమా కోసం రాజమౌళి కాశి మణికర్ణిక ఘాట్ సెట్ ని ఆర్.ఎఫ్.సీ లో వేయిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ సినిమాలో చాలా కీలక సన్నివేశాలు షూట్ చేస్తారని టాజ్క్. ఇక ఫారెస్ట్ సీన్స్ అన్నీ కూడా ఆఫ్రికాలోనే ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న.
ఐతే త్వరలోనే రాజమౌళి అండ్ టీం ప్రెస్ మీట్ పెట్టి SSMB 29 ఫుల్ కాస్ట్ అండ్ క్రూ ని వెల్లడిస్తారని తెలుస్తుంది. ఐతే ఆ ప్రెస్ మీట్ ఎప్పుడన్నది మాత్రం తెలియట్లేదు. ఐతే బాహుబలి, RRR లాగా 3 ఏళ్లు కాకుండా మహేష్ సినిమాను ఏడాదిన్నరలో పూర్తి చేసి రిలీజ్ చేయాలని గట్టిగా అనుకుంటున్నాడట రాజమౌళి. మహేష్ కూడా అందుకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేందుకు ఓకే చెప్పాడట. సో మహేష్ రాజమౌళి 2027 లోగా సినిమా పూర్తి చేసి ఆ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేస్తే మాత్రం రికార్డే అవుతుంది.
అలా కాకపోయినా 2028 లో వచ్చినా సూపర్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ అనేస్తున్నారు. ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నారు. సినిమాలో మహేష్ లుక్ ఇంకా క్యారెక్టరైజేషన్ హాలీవుడ్ హీరోలను తలపిస్తాయని తెలుస్తుంది. RRR తో కేవలం సాంగ్ తోనే అకాడమీ అవార్డ్ సరిపెట్టుకున్న రాజమౌళి ఈ సినిమాకు మాత్రం మినిమం మూడు నాలుగు కేటగిరిల్లో నామినేట్ అయ్యి ఆస్కార్ టార్గెట్ తో వస్తున్నారని తెలుస్తుంది. మాస్టర్ క్రాఫ్ట్ రాజమౌళి సినిమా మొదలు పెట్టడమే ఆలస్యం ప్రాజెక్ట్ పై ఎలా ఎప్పుడు ఎలాంటి ప్రమోషన్స్ చేస్తూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలో బాగా తెలుసు. సో మహేష్ 29 సినిమా విషయంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.