Begin typing your search above and press return to search.

దేవర జోష్ లో జక్కన్న

ఇక సామాన్య ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   27 Sep 2024 6:42 AM GMT
దేవర జోష్ లో జక్కన్న
X

నందమూరి ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’ ఫైనల్ గా థియేటర్స్ లోకి వచ్చింది. ఇప్పటికే మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్, మార్నింగ్ షో లు పడ్డాయి. తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. ఎన్టీఆర్ అభిమానులు ‘దేవర’ సినిమాలో తారక్ క్యారెక్టర్ కు ఫిదా అయ్యారు. ఇక సామాన్య ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఫ్యాన్స్ కి అయితే విజువల్ ఫీస్ట్ అనే మాట వినిపిస్తోంది.

ఎన్టీఆర్ రెండు పాత్రలలో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడని అంటున్నారు. ఇదిలా ఉంటే సెలబ్రెటీలలో చాలా మంది ‘దేవర’ సినిమా ఎర్లీ మార్నింగ్ షోలకు హాజరయ్యారు. దర్శక ధీరుడు రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి దేవర సినిమాని వీక్షించారు. బాలానగర్ లోని ఓ థియేటర్ కి ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్లి చూసారు. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాలభైరవ, శ్రీసింహ అయితే ఈలలు, కేకలు వేస్తూ థియేటర్స్ లో సందడి చేశారు.

మహేష్ బాబు ఫ్యాన్స్ జై బాబు అంటూ నినాదాలు చేశారు. అలాగే మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరగా రాజమౌళి ఓ చిన్న స్మైల్ ఇచ్చాడు అంతే. ఈ వీడియో ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. మరో వైపు సినిమా చూసి వచ్చాక రాజమౌళి తనయుడు కార్తికేయ ట్విట్టర్ లో మూవీపై ఇంటరెస్టింగ్ పోస్ట్ పెట్టారు. రాజమౌళి సెంటిమెంట్ కి ‘దేవర’ తో ఎన్టీఆర్ బ్రేక్ వేసాడని అన్నారు. రాజమౌళి ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాతో ఎన్టీఆర్ మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తరువాత వచ్చిన ఎన్టీఆర్ ‘సుబ్బు’ మూవీ డిజాస్టర్ అయ్యింది. అప్పటి నుంచి రాజమౌళితో సినిమా చేసే హీరో నెక్స్ట్ మూవీ డిజాస్టర్ అవుతుందనే ప్రచారం తెరపైకి వచ్చింది.

‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ ‘సాహో’ తో ఫ్లాప్ అందుకున్నారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ ఆచార్య డిజాస్టర్ అయ్యింది. ఇక ఎన్టీఆర్ నుంచి ‘దేవర’ మూవీ వచ్చింది. ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ ఏమిటనేది మొదటి రోజు కలెక్షన్స్ లిస్ట్ వస్తే గాని క్లారిటీ రాదు. ఇక ఫ్యాన్స్ నుంచి సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే వీకెండ్ తర్వాత ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు థియేటర్స్ కి రప్పిస్తుందో చూడాలి.

ఎన్టీఆర్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ‘దేవర’ మూవీ తెరకెక్కింది. ప్యూర్ మాస్ యాక్షన్ బొమ్మగా ‘దేవర’ చిత్రాన్ని కొరటాల శివ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. మాస్ కథలు ఇష్టపడే ప్రేక్షకులు ‘దేవర’ చిత్రాన్ని బాగానే ఆస్వాదిస్తున్నారని అంటున్నారు. మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.