Begin typing your search above and press return to search.

'సైకో' జక్కన్న - ఏం వాడకం సామీ!

ఎప్పటి నుంచో అప్డేట్ కోసం అంతా వెయిట్ చేస్తుండగా.. ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ చేశారనే చెప్పాలి.

By:  Tupaki Desk   |   25 Jan 2025 10:30 PM GMT
సైకో జక్కన్న - ఏం వాడకం సామీ!
X

దర్శకధీరుడు రాజమౌళి.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్క అనౌన్స్మెంట్ తప్ప మరో అప్డేట్ ఇవ్వని జక్కన్న.. రీసెంట్ గా సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. ఎప్పటి నుంచో అప్డేట్ కోసం అంతా వెయిట్ చేస్తుండగా.. ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ చేశారనే చెప్పాలి.

శుక్రవారం రాత్రి రాజమౌళి ఆ వీడియో పోస్ట్‌ చేయగా, శనివారం తెల్లవారి లేచి చూసేసరికి సోషల్‌ మీడియా అంతా మహేష్- జక్కన్న మూవీకి సంబంధించిన పోస్టులతో నిండిపోయింది. బోనులో ఒక సింహం ఉండగా.. పాస్‌ పోర్ట్‌ ను చేతిలో చూపిస్తూ ఫోటోకు పోజు ఇచ్చారు రాజమౌళి. క్యాప్చర్ అనే క్యాప్షన్ ను కూడా ఆయన ఇచ్చారు.

దీంతో షూటింగ్ కోసం మహేష్ ను లాక్ చేసినట్లు, అతని పాస్ పోర్ట్ లాక్ చేసినట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీడియో బ్యాక్ గ్రౌండ్‌ లో మహేష్ బాబు స్పైడర్‌ మూవీలోని మ్యూజిక్‌ ను వాడారు. ఆ సినిమాలో సైకో ఎంటర్ అయినప్పుడు హ్యాపీ అండ్ శాడ్ మోడ్ లో ఆ మ్యూజిక్ వస్తుంది. ఎస్‌ జే సూర్య నవ్వుతూ ఇక చూడండి.. నా ఆట ఉంటుంది అన్నట్లు ఎక్స్ప్రెషన్‌ ఇస్తారు.

ఇప్పుడు ఆ మ్యూజిక్కే రాజమౌళి ఎందుకు యూజ్ చేశారోనని నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. అందుకు కారణమేంటోనని మాట్లాడుకుంటున్నారు. తాను ఇప్పుడు మహేష్ ను బంధించేశానని, సినిమా షూట్‌ పూర్తయ్యేవరకూ ఆయన లాక్ అయినట్లేనని అర్థం వచ్చేలా జక్కన్న.. స్పైడర్ మ్యూజిక్ యూజ్ చేశారేమోనని అంటున్నారు.

నార్మల్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ రాజమౌళిని పని రాక్షసుడు అంటారన్న విషయం తెలిసిందే. ఆయన సినిమా పూర్తయ్యే వరకు కూడా మరో మూవీ చేసే ఛాన్స్ నటీనటులకు ఉండదు. అంతలా అంతా డెడికేషన్‌ పెట్టాల్సిందే. ఇప్పుడు మహేష్ కూడా అంతే అన్నట్లు అర్థమయ్యేలా సింబాలిక్ గా వీడియోను జక్కన్న క్రియేట్ చేసినట్లు ఉందని అంటున్నారు. అలాగే మహేష్ గ్యాప్ దొరికినప్పుడల్లా విదేశాలకు వెళ్లడం అలవాటు. ఏడాదిలో నాలుగైదు ట్రిప్పులు వేస్తారు. ఇక జక్కన్న చేతిలో పెడితే అవేమి ఉండవని చెప్పవచ్చు.

అయితే సోషల్ మీడియా మీమ్స్ ను కూడా పాజిటివ్ గా తీసుకుని, మూవీకి యూజ్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇక రాజమౌళి పెట్టిన పోస్టుకు ఒక్కసారి కమిట్‌ అయితే నా మాట నేనే విననంటూ మహేష్ రిప్లై పెట్టారు. ప్రియాంక చోప్రా ఫైనల్ల్లీ అని కామెంట్ పెట్టగా.. ఆమె మూవీలో నటిస్తుండడం అఫీషియల్ గా ఫిక్స్ అయినట్లే. ఆస్కార్‌ విజేత కీరవాణి మూవీకి సంగీతం అందిస్తుండగా.. దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కేఎల్‌ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.